ఎన్నికల విధుల్లో కర్తవ్య లోపం
ఎన్నికల విధుల్లో కర్తవ్య లోపానికి పాల్పడిన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా పాలనాధికారి ఎం.ఎస్.దివాకర్ ఆదేశాలు జారీ చేశారు.
ముగ్గురు ఉద్యోగుల సస్పెన్షన్
హొసపేటె, న్యూస్‌టడే: ఎన్నికల విధుల్లో కర్తవ్య లోపానికి పాల్పడిన ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ జిల్లా పాలనాధికారి ఎం.ఎస్.దివాకర్ ఆదేశాలు జారీ చేశారు. హగరిబొమ్మనహళ్లి తాలూకా పంచాయతీ గుమస్తా అందానగౌడ మల్కిపాటిల్ను అదే తాలూకాలోని పోలింగ్ కేంద్రం-151కు అధికారిగా, ప్రభుత్వ కళాశాల ఉపన్యాసకురాలు ఎస్.ఆర్.సుధాను పోలింగ్ కేంద్రం-216 అధికారిగా నియమించినా విధులకు హాజరుకాకుండా కర్తవ్య లోపం చేశారు. కూడ్లిగి తాలూకా పోలింగ్ కేంద్రం సంఖ్య-46కి అధికారిగా హొసపేటె ఉపాధ్యాయుడు ప్రశాంత్‌ను నియమించారు. ఆయన కూడా విధులకు హాజరుకాకుండా కర్తవ్య లోపానికి పాల్పడ్డారు. ఈ ముగ్గురు ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ డీసీ ఆదేశాలు జారీ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జగమొండి ప్రజ్వల్.. విచారణకు సహకరించడం లేదన్న సిట్
[ 02-06-2024]
వందలాది మందిపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ విచారణకు సహకరించడం లేదని ప్రత్యేక దర్యాప్తు దళం (సిట్) అధికారులు తెలిపారు. -
అంచనాల్లో.. కూటమిదే కోట!
[ 02-06-2024]
కర్ణాటకలో లోక్‌సభ ఎన్నికల ఎగ్జిట్‌పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. వివిధ సంస్థల శ్యాంపుల్ సమీక్షల ఫలితాలు ఎన్డీఏ కూటమి ఆధిపత్యాన్ని చాటుతుందని తేల్చాయి. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి భాజపా సాధించిన స్థానాల కంటే తక్కువ స్థానాలకు పరిమితమవుతుందని ఈ సమీక్షలు వెల్లడించాయి. -
సీఈటీ ర్యాంకుల్లో అబ్బాయిల జోరు!
[ 02-06-2024]
ఇంజినీరింగ్, వ్యవసాయం, పశువైద్యం, నర్సింగ్, ఫార్మసీ, యోగా, నేచురోపతి విద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన కర్ణాటక ఉమ్మడి ప్రవేశ (కే-సీఈటీ)పరీక్షల్లో అబ్బాయిలు ర్యాంకుల్లో సత్తా చాటారు. -
విచారణకు హాజరైన సిద్ధు, డీకే
[ 02-06-2024]
విధానసభ ఎన్నికల సమయంలో ‘భాజపా నేతలు 40 శాతం కమీషన్లు తీసుకుంటున్నారు’ అంటూ ప్రకటనలు విడుదల చేసిన కేసులో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌పై నమోదైన కేసు విచారణ శనివారం ప్రారంభమైంది. -
పాలకుల మాటలు.. నీటి మూటలు
[ 02-06-2024]
రాజధాని నగరం ఈసారి వాననీటి ముంపునకు గురిచేయకుండా గట్టి చర్యలు తీసుకోవాలని ఎన్నికలకు ముందే అధికారులు, ఏలికలు భీకర ప్రతిజ్ఞ చేశారు. ఎన్నికలయ్యాక.. ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తదితరులు ముంపు ముప్పు ఎదురయ్యే ప్రాంతాలను చుట్టేసి ఈసారి సమస్య ఎదురుకాకుండా చూడడానికి అనేక ఆదేశాలిచ్చారు. -
నకిలీ ఖాతాలకు నగదు బదిలీ
[ 02-06-2024]
రాష్ట్ర వాల్మీకి అభివృద్ధి కార్పొరేషన్లో అక్రమాలకు పాల్పడి, నకిలీ ఖాతాలకు బదిలీ చేసిన నగదులో కొంత భాగం హస్తినలోని కాంగ్రెస్ నేతలకు చేరిందని విపక్ష నాయకుడు ఆర్.అశోక్ ఆరోపించారు. -
భవ్య సేవలే ఓ సైన్యం!
[ 02-06-2024]
కాంగ్రెస్ పార్టీ మహిళా అధికార ప్రతినిధిగా వ్యవహరించిన భవ్య నరసింహమూర్తి భారతీయ సైన్యంలో లెఫ్టినెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. డైరెక్టరేట్ జనరల్ టెరిటోరియల్ ఆర్మీ 2022లో నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన మొదటి మహిళగా ఆమె నిలిచారు.
తాజా వార్తలు (Latest News)
-
యూఎస్ఏ పిచ్‌లు.. హవా స్పిన్నర్లా? పేసర్లదా?
-
కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు: భాజపా ఎంపీ లక్ష్మణ్
-
‘అన్నం’ ఎప్పుడు వండుతారు?: అభిమాని ప్రశ్నకు డైరెక్టర్ సమాధానమేంటంటే
-
మరోసారి టైం వేస్టు చేసుకోవద్దు: ఎగ్జిట్ పోల్స్ తర్వాత ప్రశాంత్ కిశోర్ స్పందన
-
కౌంటింగ్ నిబంధనలపై కాంగ్రెస్ అభ్యంతరాలు.. స్పష్టతనిచ్చిన ఈసీ
-
తెలంగాణ ప్రజలు బానిసత్వాన్ని భరించరు: ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్