logo

అడిగేదెవరని.. ఆపేదెవరని!!

వైకాపా ఆధ్వర్యంలో మాధవధార వుడా కాలనీలో సోమవారం అంతర్జాతీయ మహిళ దినోత్సవ కార్యక్రమాల పేరిట అనుమతులు లేకుండా ప్రధాన రహదారి మధ్యలో పెద్ద వేదిక ఏర్పాటు చేశారు.

Published : 05 Mar 2024 03:06 IST

వైకాపా సమావేశానికి రహదారి మూసివేత

మాధవధార, న్యూస్‌టుడే: వైకాపా ఆధ్వర్యంలో మాధవధార వుడా కాలనీలో సోమవారం అంతర్జాతీయ మహిళ దినోత్సవ కార్యక్రమాల పేరిట అనుమతులు లేకుండా ప్రధాన రహదారి మధ్యలో పెద్ద వేదిక ఏర్పాటు చేశారు. వైకాపా పెద్దలు సభకు వస్తున్నారని ఆ మార్గంలో రాకపోకలు నిలిపివేశారు. వుడా కాలనీ వరకు వచ్చే 48ఎ ఆర్టీసీ బస్సులను రెండు కిలోమీటర్ల ముందు మాధవధార వద్ద ఆపేసి.. అక్కడి నుంచి వెనక్కి మళ్లించారు. సాయంత్రం 5 గంటలకు సభ అయితే.. ఉదయం 10 గంటల నుంచే రహదారిని మూసేశారు. పలు కాలనీల ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో రాకపోకలు సాగించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని