జిల్లాల్లోనూ సాంకేతిక భరోసా!
కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్‌కు చెందిన మధుకర్‌రెడ్డి(23) మాదాపూర్‌లో టెకీగా పనిచేస్తున్నాడు. పోర్నోగ్రఫీకి బానిసగా మారిన అతడు సామాజిక మాధ్యమాల ద్వారా చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రసారం చేస్తున్న
‘సైబర్‌ల్యాబ్’లో ఆధునిక అస్త్రాలు
వ్యవస్థీకృత నేరాల కట్టడికి పెట్రోలింగ్
జిల్లాల్లో కేసుల ఛేదనకు ‘సాఫ్ట్‌వేర్’ సహకారం
* కరీంనగర్ జిల్లా నుస్తులాపూర్‌కు చెందిన మధుకర్‌రెడ్డి(23) మాదాపూర్‌లో టెకీగా పనిచేస్తున్నాడు. పోర్నోగ్రఫీకి బానిసగా మారిన అతడు సామాజిక మాధ్యమాల ద్వారా చైల్డ్ పోర్నోగ్రఫీని ప్రసారం చేస్తున్న విషయం తెలంగాణ మహిళాభద్రత విభాగం సైబర్ పెట్రోలింగ్‌లో బహిర్గతమైంది. ఈ విభాగం అందించిన సాంకేతిక సహకారంతో ఎల్‌ఎండీ ఠాణా పోలీసులు కొద్దిరోజుల క్రితం అతడిని అరెస్ట్ చేశారు.
* వరంగల్ జిల్లా పరకాలకు చెందిన పాలకుర్తి అజయ్(19) మల్టీమీడియా విద్యార్థి. ఇన్‌స్టాగ్రామ్‌లో మహిళల పేరిట ఖాతా తెరిచి పలువురు అమ్మాయిల్ని వలలో వేసుకున్నాడు. వారి వ్యక్తిగత వివరాలు, చిత్రాలు సేకరించి బ్లాక్‌మెయిల్‌కు పాల్పడ్డాడు. ఓ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కటకటాల్లోకి పంపారు.
మహిళలు, చిన్నారులపై సైబర్ వేధింపుల కేసుల ఛేదనకు తెలంగాణ మహిళాభద్రత విభాగం సాంకేతిక అస్త్రాలను సంధిస్తోంది. ఇప్పటివరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్లు మినహా జిల్లాల్లో జరిగే సైబర్ నేరాలకు సంబంధించిన కేసుల్లో కటకటాలపాలయ్యే వారి సంఖ్య స్పల్పంగా ఉండేది. ఈక్రమంలోనే ఆయా కేసుల దర్యాప్తులో సాంకేతిక సహకారం అందించే బాధ్యతను షీ భరోసా సైబర్‌ల్యాబ్ భుజానికెత్తుకుంది. గత నవంబరు 2 నుంచి 30కిపైగా కేసుల దర్యాప్తులో సహకరించింది. అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన సాఫ్ట్‌వేర్లను అందుబాటులోకి తెచ్చింది. దీనిలోని డిజిటల్, సైబర్ ఫొరెన్సిక్ టూల్స్ కేసుల పరిష్కారంలో కీలకంగా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఠాణాల్లో నమోదైన కేసుల దర్యాప్తులో స్థానిక పోలీసులకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని ఈ సైబర్‌ల్యాబ్ అందిస్తోంది.
సాంకేతిక అస్త్రాలివే...
ఓపెన్‌సోర్స్ ఇంటెలిజెంట్ టూల్:
ఆన్‌లైన్ నేరాలు, సైబర్ బెదిరింపులు, మానవ అక్రమరవాణా వంటి వ్యవస్థీకృత నేరాలపై పరిశోధనకు సహకరిస్తుంది. మహిళల, చిన్నారులపై జరిగే నేరాల నియంత్రణకు సైబర్ పెట్రోలింగ్ చేస్తుంది.
ఫొరెన్సిక్ అక్విజిషన్ ఆఫ్ వెబ్‌సైట్స్(ఫా):
టార్ నెట్‌వర్క్ ద్వారా డార్క్ వెబ్‌లోని పేజీలను సేకరిస్తుంది. ఒకే పేజీలోని బహుళ స్క్రీన్‌షాట్లను వేర్వేరుగా క్యాప్చర్ చేస్తుంది. ప్రధాన పేజీకి లింక్ అయి ఉన్న వెబ్‌పేజీలను సంగ్రహిస్తుంది.
మొబైల్ ఫొరెన్సిక్ టూల్:
ఫోన్లలో తొలగించిన డేటాను సంగ్రహిస్తుంది. క్లౌడ్ బ్యాకప్‌లోని సమాచారాన్ని సేకరిస్తుంది.
డిస్క్ ఫొరెన్సిక్ టూల్:
కంప్యూటర్ సిస్టమ్‌లోని ఫైళ్లను వడబోస్తుంది. అవసరమైన ఫైల్ లేదా డేటాను సమర్థంగా వెలికితీస్తుంది.
సీ5 సీడీఆర్ అనలైజర్:
కాల్‌డేటా రికార్డులను విశ్లేషిస్తుంది. కాన్ఫరెన్స్, రిపీటెడ్ కాల్స్‌ను, టవర్ డంప్‌లను సులభంగా విశ్లేషిస్తుంది.
ఫొరెన్సిక్ బండిల్ పాస్‌వర్డ్ రికవరీ సొల్యూషన్:
ఎన్‌క్రిప్టెడ్ సమాచారాన్ని, ఇన్‌స్టంట్ మెసెంజర్లను, ఈమెయిల్ పాస్‌వర్డ్‌లను క్రాక్ చేయడానికి ఉపయోగపడుతుంది. క్లౌడ్ బ్యాకప్, క్లౌడ్ నిల్వ డేటాలను డౌన్‌లోడ్ చేస్తుంది. సేవ్ చేసిన పాస్‌వర్డ్‌లను వెబ్‌బ్రౌజర్ల నుంచి తిరిగి పొందేలా చేస్తుంది.
డిజిటల్ ఎవిడెన్స్ ఇన్వెస్టిగేటర్:
కంప్యూటర్ సిస్టంల నుంచి సాక్ష్యాలను సేకరిస్తుంది. ఫొరెన్సిక్ డిస్క్ ఇమేజ్‌ను తిరిగి సంగ్రహిస్తుంది. విండోస్, మాక్ ఆపరేటింగ్ సిస్టంల నుంచి ర్యామ్‌ని, మెమరీని రాబడుతుంది.
వీడియో రికవరీ:
డిజిటల్ వీడియో రికార్డర్(డీవీఆర్)ల నుంచి సీసీ ఫుటేజీని సంగ్రహిస్తుంది. దెబ్బతిన్న పరికరాల నుంచి సైతం డేటాను తిరిగి పొందుతుంది.
- ఈనాడు, హైదరాబాద్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC: ఏఈ ప్రశ్నపత్రం ఎంతమందికి విక్రయించారు?.. కొనసాగుతోన్న మూడో రోజు సిట్ విచారణ
-
India News
Tourism: ఈ దేశాల్లో పర్యటన.. భారతీయులకు చాలా సులువు
-
World News
School Shooting: పక్కా ప్రణాళిక రచించి.. మ్యాపుతో వచ్చి..: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
-
Movies News
Nani: ఆ రాంబాబేనా ఈ ‘ధరణి’?.. ఆసక్తికరం నాని జర్నీ!
-
Crime News
Vizag : ఆత్మహత్య చేసుకుంటామని బంధువులకు సెల్ఫీ వీడియో పంపిన దంపతులు..
-
India News
Rahul Gandhi: ‘చట్టాన్ని గౌరవించడమే.. ’: రాహుల్ ‘అనర్హత’పై అమెరికా స్పందన ఇదే..