icon icon icon
icon icon icon

Assembly Elections: 12 రాష్ట్రాలకు ఎగబాకిన భాజపా.. కాంగ్రెస్‌ మూడింటికే పరిమితం

రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం ద్వారా దేశంలో భాజపా సొంతగా అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 12కు చేరుకుంది.

Published : 03 Dec 2023 23:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో భాజపా (BJP) సత్తా చాటింది. మధ్యప్రదేశ్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడంతోపాటు రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో అధికార కాంగ్రెస్‌ (Congress)ను కంగుతినిపించింది. దీంతో దేశంలో భాజపా సొంతగా అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య 12కు చేరుకుంది. మరోవైపు.. కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల సంఖ్య మూడుకు తగ్గింది. హిమాచల్‌ప్రదేశ్‌, కర్ణాటకలో ఇప్పటికే హస్తం పార్టీ అధికారంలో ఉండగా.. తాజాగా తెలంగాణను కైవసం చేసుకుంది.

భాజపా ప్రస్తుతం ఉత్తరాఖండ్‌, హరియాణా, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, గోవా, అస్సాం, త్రిపుర, మణిపుర్‌, అరుణాచల్‌ప్రదేశ్‌లలో అధికారంలో ఉంది. మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లలో విజయం సాధించి త్వరలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. మహారాష్ట్ర, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం ప్రభుత్వాల్లో భాగస్వామ్యం ఉంది. కర్ణాటక, హిమాచల్‌ప్రదేశ్‌, తెలంగాణలకే కాంగ్రెస్‌ పరిమితమయ్యింది. బిహార్‌, ఝార్ఖండ్‌లలోని అధికార కూటమిలో భాగం. తమిళనాడులో డీఎంకేకు కేవలం మిత్రపక్షంగా ఉంది. ప్రభుత్వంలో పాత్ర లేదు.

అహంకార కూటమికి.. ఇదో హెచ్చరిక: ప్రధాని మోదీ

ఇప్పటికే దిల్లీ, పంజాబ్‌లలో అధికారంలో ఉన్న అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆధ్వర్యంలోని ‘ఆమ్‌ ఆద్మీ పార్టీ’ దేశంలో మూడో అతిపెద్ద జాతీయ పార్టీగా నిలిచింది. ఇదిలా ఉండగా.. మొత్తం 543 లోక్‌సభా స్థానాల్లో సగానికిపైగా ప్రస్తుతం భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వాల చేతుల్లోనే ఉన్నాయి. మరోవైపు.. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌లకు అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. జమ్ము-కశ్మీర్‌లోనూ అసెంబ్లీ ఎన్నికలు పెండింగ్‌లో ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img