icon icon icon
icon icon icon

నాగర్‌కర్నూల్

నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ నియోజకవర్గం 1962లో ఏర్పడింది.  దీన్ని (Nagarkurnool Lok Sabha constituency) ఎస్సీలకు రిజర్వ్‌ చేశారు.

Published : 10 May 2024 15:12 IST

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: ఈ లోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. గద్వాల, అలంపూర్, వనపర్తి, నాగర్‌కర్నూల్, అచ్చంపేట, కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాలు దీని పరిధిలోకి వస్తాయి. 2019 ఎన్నికల్లో తెరాస అభ్యర్థి పోతుగంటి రాములు విజయం సాధించారు.

ప్రస్తుత ఎన్నికల్లో భాజపా నుంచి పి.భరత్‌ ప్రసాద్‌ పోటీ చేస్తుండగా, కాంగ్రెస్‌ నుంచి మల్లు రవి, భారాస నుంచి ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ బరిలో నిలిచారు.

  • ఇప్పటివరకు గెలుపొందిన అభ్యర్థులు వీరే!
  • 1962 : జేబీ ముత్యాల్‌రావు (కాంగ్రెస్)
  • 1967 : జేబీ ముత్యాల్‌రావు (కాంగ్రెస్)
  • 1972 : భీష్మదేవ్ (తెలంగాణ ప్రజాసమితి)
  • 1977 : భీష్మదేవ్ (కాంగ్రెస్)
  • 1981 :మల్లు అనంతరాములు (కాంగ్రెస్)
  • 1983 : వి.తులసిరాం (తెదేపా)
  • 1984 : వి.తులసిరాం (తెదేపా)
  • 1989 : మల్లు అనంతరాములు (కాంగ్రెస్)
  • 1991 : మల్లు రవి (కాంగ్రెస్)
  • 1996 : మంద జగన్నాథ్ (తెదేపా)
  • 1998 : మల్లురవి (కాంగ్రెస్)
  • 1999 : మంద జగన్నాథ్ (తెదేపా)
  • 2004 : మంద జగన్నాథ్ (తెదేపా)
  • 2009 : మంద జగన్నాథ్ (కాంగ్రెస్)
  • 2014: నంది ఎల్లయ్య(కాంగ్రెస్‌)
  • 2019: పోతుగంటి రాములు (తెరాస)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img