icon icon icon
icon icon icon

అనంతపురం

అనంతపురం లోక్‌సభ నియోజక వర్గంలో (Anantapur Lok Sabha constituency) మొత్తం ఏడు అసెంబ్లీ నియోజక వర్గాలు ఉన్నాయి.

Published : 01 May 2024 18:50 IST

నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. అనంతపురం లోక్‌సభ నియోజకవర్గంలో ఉన్న రాప్తాడు మండలం, అనంతపురం రూరల్ మండలం కొంతభాగం, ఆత్మకూరు మండలాలు ఇప్పుడు హిందూపూర్ లోక్‌సభ నియోజకవర్గంలో భాగమయ్యాయి. రెవెన్యూ డివిజన్ల పరిధిలో కలిపి మొత్తం 63 మండలాలున్నాయి. ఇది జనరల్  కేటగిరిలో ఉంది.

లోక్‌సభ పరిధిలోని అసెంబ్లీ స్థానాలు: మొత్తం ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. రాయదుర్గం, ఉరవకొండ, గుంతకల్‌, తాడిపత్రి, శింగనమల(ఎస్సీ), అనంతపురం పట్టణం, కళ్యాణదుర్గం దీని పరిధిలోకి వస్తాయి.

ఓటర్లు: తాజా గణాంకాల ప్రకారం.. 17,47,912 మంది ఓటర్ల ఉండగా, 8,65,742 మంది పురుషులు, 8,81,938 మహిళలు.. 232 ట్రాన్స్‌జెండర్‌ ఓటర్లు ఉన్నారు.

2019 ఎన్నికల్లో తెదేపా అభ్యర్థి జేసీ పవన్‌రెడ్డిపై తలారి రంగయ్య విజయం సాధించారు.

ప్రస్తుతం తెదేపా నుంచి అంబికా లక్ష్మీనారాయణ, వైకాపా నుంచి మాలగుండ్ల శంకరనారాయణ పోటీ చేస్తున్నారు. వజ్జల మల్లికార్జున్‌ను కాంగ్రెస్‌ పార్టీ బరిలోకి దింపింది.

  • నియోజకవర్గం నుంచి గెలుపొందిన అభ్యర్థులు
  • 1952: పైడి లక్ష్మయ్య (కాంగ్రెస్)
  • 1957: తరిమెల నాగిరెడ్డి (కమ్యూనిష్టు పార్టీ)
  • 1962: ఉస్మాన్ అలీఖాన్ (కాంగ్రెస్)
  • 1967: పొన్నపాటి ఆంటోని రెడ్డి (కాంగ్రెస్)
  • 1971: పొన్నపాటి ఆంటోనిరెడ్డి (కాంగ్రెస్)
  • 1977: దారుర్ పుల్లయ్య (కాంగ్రెస్)
  • 1980: దారుర్ పుల్లయ్య (కాంగ్రెస్)
  • 1984: డి.నారాయణ స్వామి (తెదేపా)
  • 1989: అనంత వెంకటరెడ్డి (కాంగ్రెస్)
  • 1991: అనంత వెంకటరెడ్డి (కాంగ్రెస్)
  • 1996: అనంత వెంకట రామిరెడ్డి (కాంగ్రెస్)
  • 1998: అనంత వెంకటరామిరెడ్డి (కాంగ్రెస్)
  • 1999: కాలవ శ్రీనివాసులు (తెదేపా)
  • 2004: అనంత వెంకటరామిరెడ్డి (కాంగ్రెస్)
  • 2009: అనంత వెంకటరామిరెడ్డి (కాంగ్రెస్)
  • 2014: జె. సి. దివాకర్ రెడ్డి (తెదేపా)
  • 2019 తలారి రంగయ్య (వైకాపా)
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img