icon icon icon
icon icon icon

KCR: చింతమడకలో ఓటు వేసిన సీఎం కేసీఆర్‌ దంపతులు

భారాస అధినేత, సీఎం కేసీఆర్ (KCR) ఓటు హక్కు వినియోగించుకున్నారు. (Telangana Elections 2023) తన సతీమణి శోభతో కలిసి సిద్దిపేట జిల్లా చింతమడకకు వెళ్లిన సీఎం.. అక్కడి పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు.

Updated : 30 Nov 2023 12:57 IST

సిద్దిపేట: భారాస అధినేత, సీఎం కేసీఆర్ (KCR) ఓటు హక్కు వినియోగించుకున్నారు. (Telangana Elections 2023) తన సతీమణి శోభతో కలిసి సిద్దిపేట జిల్లా చింతమడకకు వెళ్లిన సీఎం.. అక్కడి పోలింగ్‌ కేంద్రంలో ఓటు వేశారు. అనంతరం ఓటర్లకు అభివాదం చేసుకుంటూ ఆయన వెళ్లిపోయారు.  

చెదురుమదురు ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటల సమయానికి 20.64 శాతం పోలింగ్‌ మాత్రే నమోదైంది. పట్టణ ప్రాంతాల్లో ఓటింగ్‌ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం తర్వాత పోలింగ్‌ శాతం పెరగొచ్చని అధికారులు భావిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img