icon icon icon
icon icon icon

Mizoram Election Results: మిజోరంలో కొనసాగుతున్న కౌంటింగ్‌.. ఆధిక్యంలో ప్రతిపక్ష పార్టీ

Mizoram Election Results: మిజోరం శాసనసభ ఎన్నికలకు ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ప్రస్తుతం అక్కడ ప్రతిపక్ష జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ పార్టీ ఆధిక్యంలో ఉంది.

Updated : 06 Dec 2023 12:27 IST

ఐజ్వాల్‌: ఈశాన్య రాష్ట్రం మిజోరం (Mizoram)లో ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల (Assembly polls)కు సోమవారం ఓట్ల లెక్కింపు (Counting) కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభించగా.. తొలుత పోస్టల్‌ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. ఆ తర్వాత ఈవీఎం ఓట్ల కౌంటింగ్‌ చేపట్టారు. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. ప్రతిపక్ష జోరం పీపుల్స్‌ మూవ్‌మెంట్‌ (ZPM) పార్టీ 22 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. అధికార మిజో నేషనల్ ఫ్రంట్‌ (MNF) 10 చోట్ల ముందంజలో ఉంది. భాజపా, కాంగ్రెస్‌ చెరో స్థానంలో ఆధిక్యంలో ఉన్నాయి.

రాష్ట్రంలో మొత్తం 40 అసెంబ్లీ స్థానాలున్నాయి. నవంబరు 7న పోలింగ్‌ నిర్వహించారు. వాస్తవానికి మిగతా నాలుగు రాష్ట్రాలతో పాటు మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ కూడా ఆదివారమే (డిసెంబరు 3) జరగాల్సి ఉండగా.. స్థానిక పార్టీ అభ్యర్థన మేరకు నేటికి వాయిదా వేశారు.

చిన్న పార్టీలు.. జయాపజయాలపై పెద్ద ప్రభావం

ఈ ఎన్నికల్లో అధికార ఎంఎన్‌ఎఫ్‌, ప్రతిపక్ష జడ్‌పీఎం, కాంగ్రెస్‌.. మొత్తం 40 స్థానాల చొప్పున పోటీ చేశారు. భాజపా 23 స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. ఆమ్‌ ఆద్మీ పార్టీ తొలిసారిగా బరిలోకి దిగింది. ఈ ఫలితాల్లో జేపీఎం పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేసే అవకాశాలున్నాయని ఇటీవల కొన్ని ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనా వేశాయి.

2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మిజో నేషనల్‌ ఫ్రంట్‌ పార్టీ 26 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆ ఎన్నికల్లో జడ్‌పీఎంకు 8, కాంగ్రెస్‌కు 5 స్థానాలు దక్కాయి. భాజపా ఒక చోట విజయం సాధించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img