Assembly Election Results: మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో భాజపా జోరు..

Assembly Election Results: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో భాజపా హవా కొనసాగుతోంది.

Published : 03 Dec 2023 14:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Assembly election Results) వెలువడుతున్నాయి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో భాజపా హవా కొనసాగుతోంది. ఈ మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు గట్టి షాక్‌ తగిలింది. ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం..

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

  • మధ్యప్రదేశ్‌ (మొత్తం 230 స్థానాలు)లో భాజపా 13 చోట్ల గెలిచి.. మరో 143 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ 4 చోట్ల గెలిచి.. మరో 68 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. ఇతరులు 2 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
  • రాజస్థాన్‌లో (మొత్తం 199 స్థానాలు) భాజపా 24 స్థానాల్లో విజయం కైవసం చేసుకుంది. మరో 90 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక, కాంగ్రెస్‌ 16 చోట్ల గెలిచి.. మరో 55 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు రెండు స్థానాల్లో గెలిచి.. మరో 12 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.
  • ఛత్తీస్‌గఢ్‌లో (మొత్తం 90 స్థానాలు) భాజపా ఒక చోట గెలిచి.. మరో 54 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్‌ 33 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు రెండు చోట్ల ముందంజలో ఉన్నారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని