icon icon icon
icon icon icon

Assembly Election Results: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌.. ప్రముఖుల ఫలితాలు ఇలా

Assembly Election Results: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో పలువురు ప్రముఖుల ఫలితాల సరళి ఇలా ఉంది..

Updated : 03 Dec 2023 13:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు (Assembly election Results) ఆదివారం వెలువడుతున్నాయి. ఇప్పటి వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం.. ఈ రాష్ట్రాల్లో పోటీలో ఉన్న పలువురు ప్రముఖుల పరిస్థితి ఇలా ఉంది..

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు.. లైవ్‌ అప్‌డేట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

  • మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి, భాజపా అభ్యర్థి శివరాజ్‌ సింగ్ చౌహన్‌ బుద్నీలో ఆధిక్యంలోకి వచ్చారు. తొలి రౌండ్లలో ఆయన కాస్త వెనుకబడిన విషయం తెలిసిందే.
  • మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ అభ్యర్థి కమల్‌నాథ్‌ ఛింద్వాఢాలో ముందంజలో ఉన్నారు.
  • మధ్యప్రదేశ్‌లో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ దిమానీ స్థానంలో ఆధిక్యంలో ఉన్నారు.
  • రాజస్థాన్‌లో భాజపా అభ్యర్థి రాజ్యవర్ధన్‌ సింగ్‌ రాఠోడ్‌ జోత్వాఢాలో వెనుకంజలో కొనసాగుతున్నారు.
  • సర్దార్‌పురలో రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. టోంక్‌లో కాంగ్రెస్‌ నేత సచిన్‌ పైలట్‌ ఆధిక్యంలోకి వచ్చారు.
  • రాజస్థాన్‌లో మాజీ సీఎం, భాజపా అభ్యర్థి వసుంధరా రాజే ఝల్రాపటన్‌ స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
  • ఛత్తీస్‌గఢ్‌లో మాజీ ముఖ్యమంత్రి రమణ్‌ సింగ్‌ రాజనంద్‌గావ్‌లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
  • ఛత్తీస్‌గఢ్‌లో సీఎం భూపేశ్ బఘేల్‌ పటాన్‌ స్థానంలో ఆధిక్యంలోకి వచ్చారు.

ఇప్పటివరకు వెలువడిన ఫలితాల ప్రకారం.. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లో కమలం హవా కొనసాగుతోంది. ఈ మూడు రాష్ట్రాల్లో భాజపా ఆధిక్యంలో దూసుకెళ్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img