icon icon icon
icon icon icon

DK Shivakumar: మా అభ్యర్థులను ట్రాప్‌ చేసేందుకు KCR యత్నం: డీకే

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ సునాయాసంగా అధికారంలోకి వస్తోందని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(DK Shivakumar) ధీమా వ్యక్తం చేశారు.

Updated : 02 Dec 2023 15:17 IST

బెంగళూరు: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ సునాయాసంగా అధికారంలోకి వస్తోందని కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌(DK Shivakumar) ధీమా వ్యక్తం చేశారు.  తెలంగాణ ఎన్నికల(Telangana Assembly Elections 2023) ఫలితాలపై ఆయన బెంగళూరులో మీడియాతో మాట్లాడారు. ‘‘కాంగ్రెస్(Congress) అభ్యర్థులను ట్రాప్‌ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. ఆయన స్వయంగా సంప్రదించినట్లు మా పార్టీ అభ్యర్థులు చెప్పారు. గెలిచిన వారిని క్యాంపులకు తరలించే అవసరం రాదు’’ అని డీకే తెలిపారు. 

CM KCR: గాబరా పడొద్దు.. గెలిచేది మనమే

మరోవైపు 119 అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 49 కేంద్రాలను కేంద్ర ఎన్నికల సంఘం ఎంపిక చేసింది. 113 నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు 14 టేబుళ్ల ద్వారా జరుగనుంది.  500లకు పైగా పోలింగ్‌ కేంద్రాలున్న 6 నియోజకవర్గాల్లో 28 టేబుళ్లను ఏర్పాటు చేయనున్నారు. ఆదివారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం అవుతుంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img