icon icon icon
icon icon icon

Janasena: జనసేనకు కామన్‌ సింబల్‌ కేటాయించిన ఈసీ

జనసేన పార్టీకి కామన్‌ సింబల్‌ ‘గ్లాసు’ గుర్తు కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

Updated : 28 Apr 2024 22:20 IST

అమరావతి: జనసేన పార్టీకి కామన్‌ సింబల్‌ ‘గ్లాసు’ గుర్తు కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్‌కుమార్‌ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో గ్లాసు గుర్తును ఎన్నికల సంఘం ఫ్రీ సింబల్స్‌ జాబితాలో పేర్కొన్న విషయం తెలిసిందే. ఎన్నికల గుర్తుల కేటాయింపు నిబంధనల్లోని పేరా 10(బి) ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ గ్లాసు గుర్తును జనసేనకు మాత్రమే కేటాయించేలా ఈసీ ఆదేశాల్లో పేర్కొంది. తెదేపా, భాజపాతో పొత్తులో భాగంగా 21 అసెంబ్లీ, 2 పార్లమెంట్‌ స్థానాల్లో జనసేన అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ స్థాపించిన  జై భారత్‌ నేషనల్‌ పార్టీకి అన్ని నియోజకవర్గాల్లో ‘టార్చ్‌లైట్‌’ గుర్తును కేటాయిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. బీసీవై పార్టీ రామచంద్రయాదవ్ కు చెరకు రైతు గుర్తును, మరో 35 పార్టీలకు అన్ని నియోజకవర్గాల్లోనూ కామన్ సింబల్ వర్తింపజేసేలా ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img