icon icon icon
icon icon icon

ప్రచారం ఎక్కడుంటే పడక అక్కడే!

పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.. ఏ పని చేసినా వినూత్నమే. ఓ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా, అధికారులను కదిలించాలన్నా.. ఆయన ప్రత్యేకంగా కసరత్తు చేస్తారు.

Updated : 25 Apr 2024 13:34 IST

న్యూస్‌టుడే, పాలకొల్లు: పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు.. ఏ పని చేసినా వినూత్నమే. ఓ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలన్నా, అధికారులను కదిలించాలన్నా.. ఆయన ప్రత్యేకంగా కసరత్తు చేస్తారు. ఇక ఎన్నికలు.. ప్రచారం అంటే ఊరుకుంటారా..! అందుకే ఎక్కడ ప్రచారం చేస్తే.. ఆ ప్రాంతంలోనే బస చేస్తూ ముందుకు సాగుతున్నారు. ఇంటింటి ప్రచారంలో భాగంగా యలమంచిలి మండలం చించినాడలో ప్రచారం ముగిశాక అక్కడే అల్పాహారం తీసుకొని, నిద్రకు ఉపక్రమిస్తున్నారు. తెల్లవారుజామున నిద్రలేచి రోడ్డు పక్కనే స్నానం చేసి మళ్లీ అక్కడి నుంచే ప్రచారానికి వెళ్తారని నాయకులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img