icon icon icon
icon icon icon

ప్రజల ఆస్తులు కొట్టేసేందుకే ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టం

రాష్ట్రప్రభుత్వం ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో ప్రజల ఆస్తులు, భూములను కొట్టేసే ప్రయత్నం చేస్తోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు.

Published : 04 May 2024 04:24 IST

తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌

ఈనాడు, కర్నూలు: రాష్ట్రప్రభుత్వం ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో ప్రజల ఆస్తులు, భూములను కొట్టేసే ప్రయత్నం చేస్తోందని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఆరోపించారు. నంద్యాలలోని రాణి-మహారాణి థియేటర్ల మైదానంలో శుక్రవారం నిర్వహించిన యువగళం సభలో ఆయన యువతీ యువకులతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా లోకేశ్‌ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి అప్పుల అప్పారావులా తయారయ్యారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ స్థలాలు, సచివాలయం, అసెంబ్లీ, చివరకు రహదారులనూ తాకట్టు పెట్టారన్నారు. తాజాగా ప్రజల భూములను తాకట్టు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. తాత ముత్తాతలు, తల్లిదండ్రులు తమ వారసులకు ఇచ్చిన భూముల్లో జగన్‌ తన ఫొటోతో సర్వే రాళ్లు వేయించుకున్నారని, పాస్‌ పుస్తకాలపై తన ఫొటోలు వేసుకున్నారని విమర్శించారు. ఇంతకాలం ముఖ్యమంత్రి తాను మీ బిడ్డనంటూ అందరినీ నమ్మించారని.. ఇకపై మీ బిడ్డను కాబట్టి మీ ఆస్తులు కూడా ఇవ్వాలంటారని ఎద్దేవా చేశారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ చట్టంతో అనేక ఇబ్బందులు ఉన్నాయని చెప్పారు. ఎవరైనా భూముల్ని ఆక్రమిస్తే అధికారులే వివాదాల్ని పరిష్కరించాల్సి ఉందని, ప్రజలు న్యాయస్థానాలను ఆశ్రయించే హక్కు కూడా ఉండదని తెలిపారు. ఇళ్లు, భూములు వైకాపా నాయకుల పేరుపై రాసేందుకే ఈ చట్టాన్ని తెచ్చారని ఆరోపించారు. తెదేపా అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తుందని హామీ ఇచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img