icon icon icon
icon icon icon

ఫొటో లేకుండానే ఓటరు సమాచార పత్రం.. గతానికి భిన్నంగా స్లిప్పులు

సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లకు అందించే ఓటరు సమాచార పత్రాలను ఎన్నికల ఉద్యోగులు సిద్ధం చేస్తున్నారు. గతానికి భిన్నంగా ఈ సారి ఓటరు ఫొటో లేకుండానే ఈ స్లిప్పులు ఇవ్వనున్నారు.

Updated : 28 Apr 2024 07:55 IST

దాని స్థానంలో క్యూఆర్‌ కోడ్‌

నందిగామ, న్యూస్‌టుడే: సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్లకు అందించే ఓటరు సమాచార పత్రాలను ఎన్నికల ఉద్యోగులు సిద్ధం చేస్తున్నారు. గతానికి భిన్నంగా ఈ సారి ఓటరు ఫొటో లేకుండానే ఈ స్లిప్పులు ఇవ్వనున్నారు. దానిపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేస్తే ఫొటోతో పాటు సమాచారం వస్తుంది. దీనితో పాటు ఆ స్లిప్పులపై అసెంబ్లీ నియోజకవర్గం, గ్రామం పేరు, ఓటరు పేరు, ఓటరు గుర్తింపు సంఖ్య (ఎపిక్‌ నంబర్‌), క్రమ సంఖ్య, పోలింగ్‌ కేంద్రం పేరు, ఎన్నికల చీఫ్‌ కమిషనర్‌ హెల్ప్‌ లైన్‌ నంబర్‌ వివరాలు ఇచ్చారు. మే 7 వరకు ఓటర్లకు బీఎల్వోల ద్వారా వాటిని అందిస్తామని ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి రవీంద్రరావు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img

నియోజకవర్గ సమాచారం