icon icon icon
icon icon icon

Genaral Elections: సార్వత్రిక ఎన్నికల వేళ తెలుగు రాష్ట్రాల్లో భారీగా సొత్తు స్వాధీనం

సార్వత్రిక ఎన్నికల తనిఖీల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

Updated : 29 Apr 2024 22:49 IST

అమరావతి: సార్వత్రిక ఎన్నికల తనిఖీల్లో భాగంగా తెలుగు రాష్ట్రాల్లో భారీగా సొత్తును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో రూ.119 కోట్ల విలువైన అక్రమ మద్యం, డ్రగ్స్‌ను స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో సిబ్బంది పట్టుకున్నారు. కర్ణాటక, తెలంగాణ, గోవా నుంచి వస్తున్న మద్యాన్ని కట్టడి చేసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 150కి పైగా చెక్‌పోస్టుల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు. మొత్తం 68,312 కేసులు నమోదు చేశారు. ముందస్తుగా మరో 39,232 మందిపై పోలీసులు బైండోవర్‌ కేసులు నమోదు చేశారు.

మరోవైపు తెలంగాణలో ఇప్పటివరకు రూ.202 కోట్ల సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రూ.76.65 కోట్ల నగదు, రూ.43.57 కోట్ల విలువైన మద్యం, రూ. 29.62 కోట్ల విలువైన 118 కిలోల బంగారం, వెండి ఆభరణాలు, రూ.26.54 కోట్ల విలువైన 13.86 లక్షల వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img