icon icon icon
icon icon icon

KCR: తెలంగాణను అన్ని రకాలుగా గోస పెట్టింది కాంగ్రెస్సే: కేసీఆర్

50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలన.. గత 10 ఏళ్ల భారాస పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని ప్రజలను భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు.

Updated : 28 Nov 2023 15:07 IST

వరంగల్‌: 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలన.. గత 10 ఏళ్ల భారాస పాలనను ప్రజలు బేరీజు వేసుకోవాలని ప్రజలను భారాస అధినేత, సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. తెలంగాణను అన్ని రకాలుగా గోస పెట్టింది కాంగ్రెస్సేనని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడారు. 

‘‘దేశంలో తలసరి ఆదాయంలో తెలంగాణ నంబర్‌వన్‌ స్థానంలో ఉంది. కంటి వెలుగు కార్యక్రమం ఉంటుందని ఎవరూ కలలో కూడా అనుకోలేదు. రాష్ట్రంలో 3 కోట్ల మందికి కంటి పరీక్షలు చేసి 80 లక్షల మందికి కళ్లద్దాలు పంపిణీ చేశాం. విద్య, వైద్య రంగాల్లో అన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. రాష్ట్రంలో రెండో అతిపెద్ద నగరంగా ఉన్న వరంగల్‌ను మరింత అభివృద్ధి చేస్తాం. తెలంగాణ ఉద్యమ సమయంలో అతిపెద్ద బహిరంగ సభను వరంగల్‌లో నిర్వహించాం.

తెలంగాణ సాధించడం కోసమే భారాస పుట్టింది. ఇందిరమ్మ రాజ్యం సరిగా ఉంటే ఎన్టీఆర్‌ ఎందుకు పార్టీ పెట్టారు?. ఏ పార్టీ చరిత్ర ఏంటో ప్రజలు చూడాలి. వరంగల్‌లో గతంలో 3-4 రోజులకు ఒకసారి నీళ్లొచ్చేవి. ఇప్పుడు మిషన్‌ భగీరథ ద్వారా రోజూ బ్రహ్మాండంగా వస్తున్నాయి. వరంగల్‌కు మెగా టెక్స్‌టైల్‌ పార్కు తీసుకొచ్చాం. ఏడాదిలో లక్ష మందికి ఉద్యోగాలు రాబోతున్నాయి’’ అని కేసీఆర్‌ అన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img