icon icon icon
icon icon icon

KTR: విద్యావంతులంతా తమ బాధ్యతను నిర్వర్తించాలి: కేటీఆర్‌

తెలంగాణ పౌరుడిగా తన బాధ్యతను నెరవేర్చానని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ (KTR) తెలిపారు.

Updated : 30 Nov 2023 18:23 IST

హైదరాబాద్‌: తెలంగాణ పౌరుడిగా తన బాధ్యతను నెరవేర్చానని భారాస (BRS) కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్‌ (KTR) తెలిపారు. తెలంగాణలో (Telangana Elections 2023) ఓటు ఉన్న పౌరులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన కోరారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో తన సతీమణి శైలిమతో కలిసి కేటీఆర్‌ ఓటు వేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లేవాళ్లకే ఓటు వేశానని తెలిపారు.

‘‘ప్రజాస్వామ్యంలో ఇది పెద్ద పండుగ. నగర, పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు పూర్తిస్థాయిలో ఓటింగ్‌కు రావడం లేదు. అందరూ బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకోండి. పట్టణాల్లో ఓటింగ్‌ శాతం తక్కువగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. విద్యావంతులంతా తమ బాధ్యతను నిర్వర్తించాలి. నా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లే పార్టీకి ఓటు వేశాను’’ అని కేటీఆర్‌ చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img