icon icon icon
icon icon icon

Harish Rao: ఆరోగ్యశ్రీ పరిమితి రూ.15 లక్షలకు పెంచుతాం: మంత్రి హరీశ్‌

12 సార్లు ఎన్నికల్లో గెలిపించినా జహీరాబాద్‌కు కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమీ లేదని మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు.

Published : 16 Nov 2023 13:26 IST

జహీరాబాద్‌: 12 సార్లు ఎన్నికల్లో గెలిపించినా జహీరాబాద్‌కు కాంగ్రెస్‌ పార్టీ చేసిందేమీ లేదని మంత్రి హరీశ్‌రావు దుయ్యబట్టారు. జహీరాబాద్‌లో జరిగిన భారాస ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి హరీశ్‌ మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల వేళ కర్ణాటకలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ ఎందుకు నెరవేర్చలేదు? అని ప్రశ్నించారు. కర్ణాటకలో అమలు చేయలేని హామీలను తెలంగాణలో నెరవేరుస్తారా? అని ఎద్దేవా చేశారు. కర్ణాటకలో 5 గంటల కరెంట్‌ ఇస్తామని కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని.. ప్రస్తుతం అక్కడ రైతులకు 2 గంటల కరెంట్‌ కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. భారాస మళ్లీ అధికారంలోకి వస్తే రైతుబంధు కింద ఎకరాకు రూ.16 వేలు ఇస్తామన్నారు. జనవరి నుంచి అసైన్డ్‌ భూములకు పట్టాలు ఇవ్వడమే కాకుండా ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.15 లక్షలకు పెంచబోతున్నామని మంత్రి హరీశ్‌ హామీ ఇచ్చారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img