icon icon icon
icon icon icon

Nara Lokesh: ప్రభుత్వం మారినప్పుడల్లా పరిశ్రమలు తరలిపోకుండా ప్రత్యేక చట్టం: నారా లోకేశ్‌

తమ పార్టీ అధికారంలోకి వచ్చాక వైకాపా హయాంలో అదృశ్యమైన యువతుల ఆచూకీ కనుక్కొని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు.

Published : 22 Apr 2024 11:37 IST

అమరావతి: తమ పార్టీ అధికారంలోకి వచ్చాక వైకాపా హయాంలో అదృశ్యమైన యువతుల ఆచూకీ కనుక్కొని వారి కుటుంబ సభ్యులకు అప్పగిస్తామని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళగిరి మండలం కాజాలోని ఏఆర్ అపార్టుమెంట్‌ వాసులతో ఆయన సమావేశమై మాట్లాడారు. తమపై తప్పుడు కేసులు పెట్టిన అధికారులపై న్యాయ విచారణ జరిపి ఉద్యోగం నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అపార్టుమెంట్‌ వాసులు పలు సమస్యలను లోకేశ్‌ దృష్టికి తీసుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వం మారినప్పుడల్లా పరిశ్రమలు తరలిపోకుండా ప్రత్యేకమైన చట్టాన్ని తీసుకొస్తామన్నారు. పారిశ్రామికవేత్తలకు ఇచ్చే రాయితీలను చట్టబద్ధం చేస్తామని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img