icon icon icon
icon icon icon

Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

ఏపీ, తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్‌ ఉపసంహరణ గడువు ముగిసింది.

Updated : 29 Apr 2024 19:54 IST

అమరావతి: ఏపీ, తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో కీలకమైన నామినేషన్‌ ఉపసంహరణ గడువు ముగిసింది. తిరుపతి అసెంబ్లీ స్థానంలో అత్యధికంగా 46 మంది, నగరిలో అత్యల్పంగా ఆరుగులు అభ్యర్థులు బరిలో నిలిచారు. కుప్పంలో తెదేపా అధినేత చంద్రబాబు సహా 13 మంది పోటీలో ఉన్నారు. మంగళగిరిలో లోకేశ్‌ సహా 40 మంది, పులివెందులలో జగన్‌ సహా 27 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఏపీలోని 175 శాసనసభ నియోజకవర్గాలకు మొత్తం 4,210 నామినేషన్లు దాఖలు కాగా 2,705 ఆమోదం పొందాయి. 25 లోక్‌సభ నియోజకవర్గాలకు 731 నామినేషన్లు రాగా.. 503 నామపత్రాలను ఈసీ ఆమోదించింది.

తెలంగాణలోని 17 లోక్‌సభ స్థానాలకు గానూ 625 నామినేషన్లను ఆమోదించగా... 100 మంది ఉపసంహరించుకున్నారు. దీంతో 525 మంది పోటీలో నిలిచారు. అత్యధికంగా సికింద్రాబాద్‌ లోక్‌సభకు 45 మంది, అత్యల్పంగా ఆదిలాబాద్‌ లోక్‌సభకు 12 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. లోక్‌సభ స్థానాల వారీగా పరిశీలిస్తే.. పెద్దపల్లిలో-42, కరీంనగర్‌లో -28, నిజామాబాద్‌లో-29, జహీరాబాద్‌లో-19, మెదక్‌లో-44, మల్కాజిగిరిలో-22, హైదరాబాద్‌లో-30, చేవెళ్లలో-43, మహబూబ్‌నగర్‌లో-31, నాగర్‌ కర్నూల్‌లో-19, నల్గొండలో-22, భువనగిరిలో-39, వరంగల్‌లో-42, మహబూబాబాద్‌లో-23, ఖమ్మంలో-35 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మే 13న పోలింగ్‌, జూన్‌ 4న ఓట్ల లెక్కింపు జరగనుంది.

ఏపీ అసెంబ్లీకి పోటీ చేసే అభ్యర్థులు వీళ్లే..!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img