icon icon icon
icon icon icon

వైకాపాకు అనుకూలంగా మీడియా సర్టిఫికేషన్‌ కమిటీ: ఈసీకి విపక్షాల ఫిర్యాదు

ఏపీలో వైకాపాకు అనుకూలంగా మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటర్‌ కమిటీ (ఎంసీఎంసీ) వ్యవహరిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి.

Published : 28 Apr 2024 13:23 IST

అమరావతి: ఏపీలో వైకాపాకు అనుకూలంగా మీడియా సర్టిఫికేషన్‌ అండ్‌ మానిటర్‌ కమిటీ (ఎంసీఎంసీ) వ్యవహరిస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఆ పార్టీ ఇచ్చే ప్రకటనల్లో ప్రభుత్వ లోగో వినియోగంపై నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ఆ లోగో వాడినా అనుమతి ఇవ్వడాన్ని ఆక్షేపిస్తున్నారు. ఈ మేరకు ఎన్నికల సంఘానికి విపక్ష నేతలు ఫిర్యాదు చేశారు. సోషల్‌ మీడియాలో ప్రభుత్వ లోగోతోనే వైకాపా ప్రచారం చేస్తోందని.. దీనికి ఎంసీఎంసీ ఎలా అనుమతిచ్చారని నిలదీశారు. ప్రకటనకు అనుమతి ఇచ్చిన కమిటీపై చర్యలు తీసుకోవాలని ఈసీని విపక్షాలు కోరాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img