icon icon icon
icon icon icon

Congress: భాజపాకు సీఎం అభ్యర్థే లేరు..: ప్రియాంక విమర్శలు

ఓట్లు రాబట్టుకొనేందుకు భావోద్వేగాలు, మతం వంటివి వాడితే అలాంటి రాజకీయాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్‌ నేత ప్రియాంక గాంధీ ప్రజలకు సూచించారు.

Published : 17 Nov 2023 17:15 IST

జైపుర్‌:  రాజస్థాన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి గెలిచి అధికారం నిలబెట్టుకొనేందుకు కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే అనేక జనాకర్షక హామీలు ప్రకటించిన కాంగ్రెస్‌ ప్రచారాన్ని హోరెత్తిస్తోంది.  శుక్రవారం కాంగ్రెస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ దుంగ్రార్‌పుర్‌ జిల్లాలోని సగ్వాడాలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా భాజపాపై విమర్శలు గుప్పించారు. రాజస్థాన్‌లో భాజపా చెల్లాచెదురైందని.. ఆ పార్టీకి సీఎం అభ్యర్థి కూడా లేరన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర నలుమూలలా పర్యటిస్తున్నారని.. కొన్నిసార్లు ఆయన ముఖ్యమంత్రి అభ్యర్థిని వెతికేందుకు తిరుగుతున్నట్లు కనబడుతోందని ప్రియాంక వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో ఓట్లు రాబట్టుకొనేందుకు భావోద్వేగాలు, మతం వంటివి ప్రయోగిస్తే అలాంటివాటి పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు. కేంద్రంలో భాజపా హయాంలో ద్రవ్యోల్బణం పెరగడంతో రైతులతో పాటు ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారన్నారు.

‘ధరణి’ తీసేసి దందాలు చేయాలని కాంగ్రెస్‌ చూస్తోంది: కేసీఆర్‌

మరోవైపు, ఎన్నికల ప్రచారం కోసం విచ్చేసిన ప్రియాంకా గాంధీ గాయత్రీ పీఠ్‌లో హోమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్‌ నేతలు హాజరయ్యారు. రాజస్థాన్‌లో నవంబర్‌ 25న ఎన్నికల పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్‌ 3న ఫలితాలు వెల్లడి కానున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img