icon icon icon
icon icon icon

Priyanka Gandhi: బలమైన ప్రభుత్వం వచ్చి ఉంటే ప్రజల ఆకాంక్షలు నెరవేరేవి: ప్రియాంక గాంధీ

తెలంగాణ సంపదను ప్రజలకు పంచే ప్రభుత్వం వస్తుందని ప్రజలు ఆశపడ్డారు, బలమైన ప్రభుత్వం వచ్చి ఉంటే వారి ఆకాంక్షలు నెరవేరేవని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. 

Published : 25 Nov 2023 17:24 IST

మధిర: తెలంగాణ సంపదను ప్రజలకు పంచే ప్రభుత్వం వస్తుందని ప్రజలు ఆశపడ్డారని.. బలమైన ప్రభుత్వం వచ్చి ఉంటే వారి ఆకాంక్షలు నెరవేరేవని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అన్నారు. కాంగ్రెస్‌ విజయభేరి యాత్రలో భాగంగా శనివారం మధిరలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొని ప్రసంగించారు. ‘‘ ప్రజల బాధలను భారాస ప్రభుత్వం పట్టించుకోలేదు. తెలంగాణ సంపదను పంచుకోవడంలో భారాస నేతలు నిమగ్నమయ్యారు. కాంగ్రెస్‌ ప్రకటించిన 6 గ్యారంటీలు తప్పనిసరిగా అమలు చేసే బాధ్యత తీసుకుంటాం. ఇల్లు కట్టుకునేందుకు డబ్బులు ఇస్తామన్న హామీని భారాస నెరవేర్చలేదు. రైతులకు రుణామఫీ చేస్తామన్న సీఎం కేసీఆర్‌ హామీ నెరవేరలేదు. రాష్ట్రంలో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. పెరిగిన నిత్యావసర ధరలతో సామాన్యులు సతమతమవుతున్నారు.

దేశంలో ప్రజలే నాయకులు. ప్రజలకంటే అతీతులం అన్నట్టు మోదీ, కేసీఆర్‌ భావిస్తున్నారు. భారాస ప్రభుత్వం ఎవరికైనా ఉద్యోగాలు ఇచ్చిందా? మీరంతా పోరాటం చేసి తెచ్చుకున్న తెలంగాణలో.. కేసీఆర్‌ కుటుంబ సభ్యులంతా మంత్రులయ్యారు. భారాస నేతలందరికీ వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు ఉన్నాయి. భట్టి విక్రమార్క వేల కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజా సమస్యలు తెలుసుకున్నారు’’ అని ప్రియాంక గాంధీ వివరించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి భట్టిని భారీ మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img