icon icon icon
icon icon icon

Rahul Gandhi: పేపర్ల లీక్‌తో యువత నష్టపోయారు: రాహుల్‌ గాంధీ

ఈ ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు.

Published : 26 Nov 2023 15:15 IST

సంగారెడ్డి: ఈ ఎన్నికలు దొరల తెలంగాణ, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ అన్నారు. ధరణి పోర్టల్‌ పేరుతో ప్రజల భూములను భారాస నేతలు లాక్కున్నారని ఆయన ఆరోపించారు. సంగారెడ్డిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఈ పదేళ్ల భారాస పాలనలో ఏం చేశారో సీఎం కేసీఆర్‌ చెప్పాలన్నారు. 

‘‘కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. భారాస పాలనలో రాష్ట్రంలో 8వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. యువతకు ఉద్యోగాలు రాలేదు. ఉద్యోగాల కోసం లక్షల మంది నిరుద్యోగులు క్యూలో ఉన్నారు. భారాస ప్రభుత్వం వారి కోసం ఏమీ చేయలేదు. పేపర్ల లీక్‌తో యువత నష్టపోయారు. ప్రధాని మోదీ, కేసీఆర్‌ కలిసి ప్రజల జేబుల్లోని డబ్బును దోచుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి ప్రజా పాలనను చూపిస్తాం. తొలి కేబినెట్‌ సమావేశంలోనే దీనికి ఆమోదముద్ర వేస్తాం. మహిళలకు రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌ ఇచ్చి ఊరట కలిగిస్తాం’’ అని రాహుల్‌ గాంధీ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img