icon icon icon
icon icon icon

YS Sharmila: జగన్‌ వాగ్దానాలన్నీ.. మద్యం బ్రాండ్‌లకే పరిమితం: వైఎస్‌ షర్మిల

జగన్ పాలనలో మంత్రులకే సీఎం అపాయింట్‌మెంట్‌ దొరకలేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు.

Published : 28 Apr 2024 17:45 IST

టెక్కలి: జగన్ పాలనలో మంత్రులకే సీఎం అపాయింట్‌మెంట్‌ దొరకలేదని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. వైఎస్‌ఆర్‌ ఆశయాలు నిలబెడతారనే ప్రజలు జగన్‌కు ఓట్లేశారని అన్నారు. వైఎస్‌ఆర్‌ పాలనకు, జగన్‌ పాలనకు పోలిక ఉందా? అని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆమె ప్రసంగించారు. ‘‘ రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామన్న హామీ నెరవేరిందా?ఫీజు రియింబర్స్‌ మెంట్‌ బకాయిలను ఈ ప్రభుత్వం కళాశాలలకు చెల్లించలేదు. దీంతో కళాశాలలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వట్లేదు. ప్రజలకు ఏం మేలు చేశారని జగన్‌కు ఓటేయాలి? వైఎస్‌ఆర్‌ ప్రజాదర్బార్‌ పెట్టి ప్రజల మధ్యే ఉండేవారు. 

జగన్‌ ఎప్పుడైనా ప్రజలతో మమేకమయ్యారా? మద్యపాన నిషేధం చేయకపోతే మళ్లీ ఓట్లు అడగనని చెప్పారు.. చేశారా?  మద్య నిషేధం చేయలేదు కదా.. చివరికి సర్కారే మద్యం అమ్ముతోంది. ఇదేనా మాట నిలబెట్టుకోవడం అంటే. బూమ్‌..బూమ్‌, స్పెషల్‌ స్టేటస్‌.. ఇలా ప్రపంచంలో ఎక్కడా లేని బ్రాండ్లు ఏపీలోనే ఉన్నాయి. జగన్‌ వాగ్దానాలన్నీ మద్యం షాపుల్లోనే నిలబెట్టుకున్నట్టుంది. నాసిరకం మద్యం కారణంగా రాష్ట్రంలో 25 శాతం మంది చనిపోతున్నారు. జగన్‌ దేనికి సిద్ధం.. రూ.8లక్షల కోట్లు అప్పు చేయడానికా? ప్రజల నెత్తిన కుచ్చుటోపి, చెవిలో పూలు పెట్టడానికా? దేనికి సిద్ధం’’ అని ధ్వజమెత్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img