icon icon icon
icon icon icon

MP election results: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌ ప్రజల హృదయాల్లో ఉన్నారు..

MP election results: మధ్యప్రదేశ్‌లో భాజపా విజయంపై సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ స్పందించారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వల్లే తాము గెలిచామని చెప్పారు.

Published : 03 Dec 2023 18:07 IST

భూపాల్‌: మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో (Madhya Pradesh election results 2023) భాజపా అధికారాన్ని నిలబెట్టుకుంది. ఈ విజయాన్ని సీఎం శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ ప్రధాని మోదీ ఘనతగా అభివర్ణించారు. ఆయన నేతృత్వంలోని ‘డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌’ వల్లే ప్రజలు భాజపాపై విశ్వాసముంచారని తెలిపారు. మరోవైపు ప్రభుత్వ పథకాలు కూడా విజయానికి బాటలు వేసినట్లు పేర్కొన్నారు.

‘‘ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్‌ ప్రజల హృదయాల్లో ఉన్నారు. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు, కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ప్రజల అభ్యున్నతికి తోడ్పాటునందించాయి. భాజపా శ్రేణులంతా కలిసికట్టుగా కష్టపడి పనిచేశాయి. రాష్ట్ర ప్రజల్లో అసలు ఎక్కడా ప్రభుత్వ వ్యతిరేకత లేదు. ప్రజలంతా మాతోనే ఉన్నారు. కొంత మంది కాంగ్రెస్‌ నాయకులు ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూశారు. కానీ, ప్రజలు మమ్మల్ని విశ్వసించారు’’ అని మీడియాతో మాట్లాడుతూ శివరాజ్‌ సింగ్ అన్నారు.

ఐదోసారి ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించనున్నారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. ‘‘అలాంటి విషయాలపై నేను నిర్ణయం తీసుకోను. ఎవరి పాత్ర ఏంటనేది పార్టీయే నిర్ణయిస్తుంది’’ అని శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు. మధ్యప్రదేశ్‌లో మొత్తం 230 స్థానాలకు నవంబర్‌ 17న ఒకే విడతలో ఎన్నికలు జరిగాయి. మొత్తం 77.82 శాతం పోలింగ్‌ నమోదైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img