icon icon icon
icon icon icon

Ravidas Mehrotra: 251 సార్లు జైలుకెళ్లి..! రాజ్‌నాథ్‌ను ఢీకొడుతున్న ఆ నేత ఎవరు?

ఏకంగా 251 సార్లు జైలుకెళ్లిన ఓ సమాజ్‌వాదీ పార్టీ నేత.. లఖ్‌నవూ లోక్‌సభ స్థానంలో కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను ఢీకొడుతున్నారు.

Published : 29 Apr 2024 00:07 IST

లఖ్‌నవూ: ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 251 సార్లు జైలుకెళ్లారు.. లఖ్‌నవూ విశ్వవిద్యాలయంలో విద్యార్థి నాయకుడిగా మొదలైన రాజకీయ ప్రయాణంలో ఎన్నో ఎత్తుపల్లాలు చూశారు. ఆయనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని లఖ్‌నవూ స్థానం నుంచి బరిలో దిగిన సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థి రవిదాస్‌ మెహ్రోత్రా (Ravidas Mehrotra). గతంలో యూపీ మంత్రిగా పనిచేసిన ఆయన ప్రస్తుత లోక్‌సభ ఎన్నికల్లో (Lok Sabha Elections) రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌పై పోటీ చేస్తున్నారు.

సామాజిక కార్యకర్త అయిన రవిదాస్‌ తొలిసారి  1989లో లఖ్‌నవూ తూర్పు స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2012లో లఖ్‌నవూ సెంట్రల్‌ స్థానంనుంచి సమాజ్‌వాదీ పార్టీ తరఫున విజయం సాధించారు. అఖిలేశ్‌ యాదవ్‌ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2022లో మరోసారి గెలుపొందారు. అనేకసార్లు జైలుకు వెళ్లిన విషయంలో రవిదాస్‌ మాట్లాడుతూ.. ‘‘నాపై ఉన్న కేసులన్నీ యూనివర్సిటీ రోజుల్లో, ఆ తర్వాత రాజకీయాల్లోకి వచ్చినప్పుడు చేసిన ప్రదర్శనలు, నిరసనలకు సంబంధించినవే. ఒక్క క్రిమినల్ కేసు కూడా నమోదు కాలేదు. నేను మొదటినుంచి ఓ పోరాట యోధుడిననే విషయాన్ని ఈ లెక్కలే చెబుతాయి’’ అని తెలిపారు.

నవాబులు, సుల్తాన్‌ల అరాచకాలపై మౌనమా?: రాహుల్‌పై మోదీ ధ్వజం

రాజ్‌నాథ్‌పై పోటీ అంశంపై స్పందిస్తూ.. ‘‘ప్రజల ముందు పెద్ద పెద్ద యోధులే తలలు వంచారు. ఇవైతే ఎన్నికలు.. ఫలితం ఎవరిపైపు మొగ్గు చూపుతుందో ఎవరికీ తెలియదు’’ అని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. లఖ్‌నవూ స్థానానికి ఐదో విడతలో భాగంగా మే 20న పోలింగ్‌ నిర్వహించనున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img