icon icon icon
icon icon icon

Mallikarjun Kharge: తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది ఇవాళ నిర్ణయిస్తాం: ఖర్గే

తెలంగాణ సీఎం ఎవరు? మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుంది? అనే దానిపై ఉత్కంఠకు ఈరోజు తెరపడే అవకాశం ఉంది.

Updated : 05 Dec 2023 16:38 IST

దిల్లీ: తెలంగాణ సీఎం ఎవరు? మంత్రివర్గ కూర్పు ఎలా ఉంటుంది? అనే దానిపై ఉత్కంఠకు ఈరోజు తెరపడే అవకాశం ఉంది. పార్లమెంట్‌లోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే(Mallikarjun khargae) ఛాంబర్‌లో ఇండియా కూటమి సమావేశం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఖర్గే సమావేశానికి వెళ్లే ముందు మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది ఇవాళ నిర్ణయిస్తామని క్లారిటీ ఇచ్చారు.

Congress: కొత్త మంత్రులెవరు? కూర్పుపై ఆసక్తి

సోమవారం రాత్రే దిల్లీ చేరుకున్న డీకే శివకుమార్‌, మాణిక్‌రావు ఠాక్రే.. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు ఖర్గేతో భేటీ అవుతారు. ఇప్పటికే తెలంగాణ పరిణామాలపై ఖర్గే సహా కాంగ్రెస్‌ అగ్రనేతలకు డీకే శివకుమార్‌ సమాచారం ఇచ్చారు. మరోవైపు కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు మల్లు భట్టి విక్రమార్క, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా దిల్లీకి బయల్దేరివెళ్లారు. వారిద్దరు కూడా ఖర్గేతో సమావేశం కానున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    img
    img
    img
    img