cardiac: ఛాతీలో నొప్పిగా ఉందా..? ఎందుకో తెలుసుకోండి..!

ఛాతీలో నొప్పి రాగానే వెంటనే గుండెపోటు కావొచ్చనే అనుమానం వస్తుంది. అసిడిటీతో కూడా ఛాతీలో నొప్పిగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి గుండెపోటుతో పాటు ఊపిరితిత్తులు, గుండె పెద్ద రక్తనాళాల్లో తలెత్తిన సమస్యలతో ఛాతీనొప్పి వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురయినపుడు దాని వెనక ఏం దాగిఉందో తెలుసుకోవాలి.

Published : 14 Aug 2022 02:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఛాతీలో నొప్పి రాగానే వెంటనే గుండెపోటు కావొచ్చనే అనుమానం వస్తుంది. అసిడిటీతో కూడా ఛాతీలో నొప్పిగా అనిపిస్తుంది. ఒక్కొక్కసారి గుండెపోటుతో పాటు ఊపిరితిత్తులు, గుండె పెద్ద రక్తనాళాల్లో తలెత్తిన సమస్యలతో ఛాతీనొప్పి వచ్చే అవకాశం ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితి ఎదురయినపుడు దాని వెనక ఏం దాగిఉందో తెలుసుకోవాలి. ఈ ఇబ్బందులనే కార్డియాక్‌ ఎమర్జెన్సీగా చెబుతారు. వీటి గురించి ఇంటర్వెన్షనల్‌ కార్డియాలజిస్టు డాక్టర్‌ ఎన్‌. అనిల్‌కుమార్‌ పలు సూచనలు చేశారు.

గుండెకు ఇబ్బందులు ఇలా..

గుండెను ఇబ్బంది పెట్టే వాటిలో ఊపిరితిత్తుల రక్తనాళాల్లో గడ్డలు కట్టడం, ప్రథమ ధమనిలో చీలికలు రావడం, గుండెపోటు ఉంటాయి. మూడు రక్తనాళాలు మూసుకొంటే గుండెకు సంబంధించిన సమస్యలు వస్తాయి. ఎడమ రక్తనాళం మూసుకుంటే తీవ్రమైన గుండెపోటు వస్తుంది. ఈ సమస్యలన్నింటిలో రక్తం గడ్డకడుతుంది. ఇలాంటప్పుడు రోగికి రక్తం పలచన అయ్యేందుకు ఇంజిక్షన్‌ ఇస్తాం. హార్ట్‌ అటాక్‌ వచ్చిన తొలి ఆరు గంటల్లో ఆసుపత్రికి చేరుకుంటే స్టంట్‌ వేయడానికి వీలవుతుంది. ఛాతీ నొప్పి కాకుండా గుండె చుట్టూ నీరు చేరడం, హార్ట్‌రేట్‌ అధికంగా పెరగడంతో గుండె పని చేయకుండా పోతుంది. ఈ సమస్యలు తెలుసుకున్న వెంటనే చికిత్స చేయకపోతే ప్రాణాంతకంగా మారుతుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని