అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల పరిస్థితేంటి?: ఏపీ హైకోర్టు

తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు (AP High Court) తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

Updated : 05 Feb 2024 13:08 IST

అమరావతి: తెదేపా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణలో భాగంగా ఏపీ హైకోర్టు (AP High Court) తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అరెస్టు చేస్తారని ఎంపీ, ఎమ్మెల్యేలే భయపడుతుంటే సామాన్యుల సంగతేంటని ప్రశ్నించింది.

‘‘ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్న కేసుల్లో సెక్షన్‌ 41ఏ నోటీసు ఇవ్వాలి. అలా వివరణ తీసుకోకుండా అరెస్టుకు ఎలా ప్రయత్నిస్తారు? అలా చేస్తే బాధ్యులు పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సంబంధిత పోలీసు అధికారి అరెస్టుకు ఆదేశాలు ఇస్తాం. ఎవరో ఒక ఉన్నతాధికారిపై చర్యలకు ఆదేశిస్తే తప్ప పరిస్థితి చక్కబడేట్లు లేదు’’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీనిపై వివరాల సమర్పణకు అసిస్టెంట్‌ పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ సమయం కోరారు. అనంతరం తదుపరి విచారణను ఉన్నత న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని