శంషాబాద్‌లో 5 మేకలతో ఎర.. అయినా చిక్కని చిరుత

ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లోకి వచ్చిన చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.

Published : 01 May 2024 11:43 IST

శంషాబాద్‌: ఇటీవల శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు పరిసరాల్లోకి వచ్చిన చిరుతను బంధించేందుకు అటవీశాఖ అధికారుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. మేక మాంసాన్ని ఎరగా పెట్టినా ఫలితం లేకపోవడంతో.. ఈసారి ఏకంగా 5 మేకలను బోనుల్లో ఉంచారు. చిరుతను బంధించేందుకు ఎయిర్‌పోర్టు చుట్టుపక్కల 5 బోన్లు, 25 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. 

గత నాలుగు రోజులుగా అటవీశాఖకు చెందిన ప్రత్యేక బృందాలు చిరుత కదలికల్ని ఎప్పటికప్పుడు గమనిస్తున్నాయి. మంగళవారం రాత్రి బోన్లు ఏర్పాటు చేసిన 5 చోట్లా ఒక్కో మేకను వాటిలో ఉంచారు. ఇన్ని ప్రయత్నాలు చేస్తున్నా చిరుత మాత్రం చిక్కడం లేదు. ఒకే ప్రాంతంలో సంచరిస్తూ బోను వరకు వచ్చి వెనక్కి వెళుతోంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని