Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 01 May 2024 09:05 IST

1. ఉపాధి హరీ.. శ్రమజీవికి ఉరి

గత ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో పరిశ్రమలతో కళకళలాడిన జిల్లా నేడు కళావిహీనంగా మారింది. రాయితీలు ఎత్తేయడంతో యాజమాన్యాలు ఉక్కిరిబిక్కిరయ్యారు. మద్దిపాడు గ్రోత్‌ సెంటర్‌ నేడు ఎలాంటి అలికిడి లేకుండా ఉండటం కార్మిక వర్గానికి ఆవేదన   కలిగిస్తోంది. గతంలో గ్రోత్‌ సెంటరులోని పారిశ్రామికవాడను 1350 ఎకరాల్లో నెలకొల్పారు. 630 ఫ్లాట్లలో సుమారు 270 కంపెనీల వరకు ఏర్పాటు చేశారు. పూర్తి కథనం

2. సుడిగాలిలా చుట్టి రావలె

లోక్‌సభ ఎన్నికల ప్రచార గడువు మరో పదకొండు రోజుల్లో ముగియనుంది.  మొన్నటి వరకు  పూర్తిస్థాయిలో ప్రచారం చేయని అభ్యర్థులు ఇప్పుడు గడువు దగ్గరపడుతుండడంతో రాత్రిపగలూ ముమ్మరంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. వచ్చే వారం రోజులు కీలకంగా మారడంతో ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఒకవైపు గ్రామాలు మరోవైపు పట్టణాల్లో అభ్యర్థులు ఉరుకులుపరుగులు పెడుతున్నారు.పూర్తి కథనం

3. అనుమానం వచ్చిందంటే.. ఖాతా రద్దే

అడ్డగోలుగా చెలరేగిపోతున్న సైబర్‌ నేరగాళ్లకు ముకుతాడు వేయడంపై భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) దృష్టి పెట్టింది. అనుమానాస్పద ఖాతాలను వెంటనే స్తంభింపజేయాలంటూ అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. దాంతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకుల్లో ఈ తరహా ఖాతాల రద్దు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. మూడు నెలల కాలంలోనే దాదాపు 2.5 లక్షల ఖాతాలు రద్దయ్యాయి.పూర్తి కథనం

4. ఇంటికెళ్లిన వారు నగదు ఇవ్వలేరా?

ఇంటింటికీ పింఛన్ల పంపిణీని జటిలం చేయడమే ప్రభుత్వ ఉద్దేశంలా కనిపిస్తోంది. గుంటూరు జిల్లాలోని కాకుమాను మండలంలో మూడు గంటల వ్యవధిలోనే పింఛనర్ల ఇళ్లను యంత్రాంగం చుట్టివచ్చింది. అలా వెళ్లినవారు అక్కడే పింఛనునూ అందించవచ్చు. రాష్ట్రవ్యాప్తంగానూ ఇలాగే చేయవచ్చు.పూర్తి కథనం

5. ఈవీఎం @ 35ఏళ్లు..

దేశంలోని ఎన్నికల నిర్వహణలో ఈవీఎంలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. వీటిని పుట్టుపూర్వోత్తరాలను ఒకసారి తెలుసుకుదాం. ఈవీఎం(ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌)ను తొలిసారి 1989లో వినియోగంలోకి తీసుకురాగా... ప్రయోగాత్మకంగా కొన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వీటిని వినియోగించారు. దిల్లీ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లోని 25 నియోజకవర్గాల్లో మాత్రమే ఈవీఎంలను ఉపయోగించారు.పూర్తి కథనం

6. శ్రమజీవికీ ద్రోహ ‘మే’..!

తెల్లవారుజామునే నిద్ర లేచి.. ఇంటి పనులన్నీ చక్కదిద్దుకుని... చద్దిబువ్వ మూటకట్టుకుని.. పొట్టకూటి కోసం అడ్డాలకు చేరుకుంటారు వేలాది మంది భవన నిర్మాణ కార్మికులు. ఎవరైనా కాస్త పని ఇప్పించకపోతారా? అని వేయికళ్లతో ఎదురుచూస్తూనే ఉంటారు. కానీ.. కొందరికే ఆ భాగ్యం దక్కుతుంది. ఏమీ దొరకనివారు నిరాశగా ఇంటికెళ్లిపోవాల్సిందే. గత అయిదేళ్లుగా ఇదే పరిస్థితి.పూర్తి కథనం

7. జగన్‌.. ఓ బ్యాండేజ్‌ బబ్లూ

‘యువత భవితను బ్యాండేజ్‌ బబ్లూ జగన్‌ నాశనం చేశారు. ఈ ఎన్నికల్లో ఆయన్ను ఓడించి సాగనంపాలి. మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొస్తాం. తొలి సంతకం మెగా డీఎస్సీపై చేయడంతోపాటు ఒకే నోటిఫికేషన్‌తో ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తాం’ అని తెదేపా ప్రధాన కార్యదర్శి, యువగళం సారథి నారా లోకేశ్‌ భరోసానిచ్చారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో యువగళం ఎన్నికల సమరభేరి పేరుతో విద్యార్థులు, యువతతో ఆయన మంగళవారం సంభాషించారు.పూర్తి కథనం

8. జగన్‌ అక్రమాస్తుల కేసులు మళ్లీ మొదటికి

ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి అక్రమాస్తుల కేసులపై విచారణ మళ్లీ మొదటికి వచ్చింది. నిందితులు దాఖలు చేసిన డిశ్ఛార్జి పిటిషన్‌లపై తీర్పు వెలువరించాల్సిన సమయంలో న్యాయమూర్తి బదిలీ కావడంతో ఈ వ్యాజ్యాలపై తిరిగి విచారణ చేపట్టాలని(రీఓపెన్‌ చేయాలని) హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు నిర్ణయించింది. తెలంగాణ హైకోర్టు నిర్దేశించిన ప్రకారం మంగళవారం(ఏప్రిల్‌30)లోగా డిశ్ఛార్జి పిటిషన్‌లపై విచారణ పూర్తి చేయాల్సి ఉంది. పూర్తి కథనం

9. ఎండ.. ప్రచండం

రాష్ట్రంలో సూరీడు నిప్పులు చెరుగుతున్నాడు. మంగళవారం ఎండ తీవ్రత తారస్థాయికి చేరింది. జగిత్యాల, నల్గొండ, కరీంనగర్‌లు మసిలిపోయాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం జైన, నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో రాష్ట్రంలోనే అత్యధికంగా 46.2 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైంది. జగిత్యాల జిల్లా రాయిల్‌ మండలం అల్లీపూర్‌లో 46.1, బీర్పూర్‌ మండలం కొల్వాయిలో 46, కరీంనగర్‌ జిల్లా శంకరపట్నం మండలం కొత్తగట్టు, వీణవంక మండల కేంద్రంలో 46 డిగ్రీల ఎండ కాసింది.పూర్తి కథనం

10. పేదలకే ఎక్కువమంది పిల్లలను కనే సత్తా : ఖర్గే

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నోరెత్తితే అల్పసంఖ్యాకులు, పేదల గురించి మాట్లాడుతుంటారు. దేశంలోని ఆస్తులను పిల్లలు ఎక్కువగా ఉండేవారికి పంచుతారంటూ కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తుంటారు. ఎక్కువమంది పిల్లలను కనే సామర్థ్యం పేదలకే ఉంటుంది’’ అని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించారు. మంగళవారం రాత్రి కలబురగి జిల్లాలోని వాడిలో ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. దేశంలో ఏ పేద కుటుంబాన్ని చూసినా నలుగురైదుగురు పిల్లలుంటారని చెప్పారు.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని