Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 5 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 01 May 2024 17:03 IST

1. మోదీ, అమిత్‌షా నాపై పగబట్టారు: సీఎం రేవంత్‌రెడ్డి

రిజర్వేషన్లు రద్దు చేయాలని భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్ర చేస్తున్నాయని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ‘‘రిజర్వేషన్లు రద్దు చేస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎటు వెళ్లాలి?ఈ అంశంపై నేను ప్రశ్నించా. మోదీ, అమిత్‌షా నాపై పగబట్టి దిల్లీలో కేసు పెట్టారు. ఈడీ, సీబీఐ, ఐటీతోనే కాదు.. దిల్లీ పోలీసులతో భయపెట్టాలని చూస్తున్నారు’ అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. వైకాపాకు ఓటు వేస్తే ప్రజల ఆస్తులు గాలిలో దీపమే: పవన్‌ కల్యాణ్‌

జగన్‌ పాలన నుంచి ఏపీకి విముక్తి కల్పించాలన్నదే తన బలమైన లక్ష్యమని జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ అన్నారు. ‘పట్టాదారు పాస్‌పుస్తకాలపై ఆంధ్రప్రదేశ్‌ రాజముద్ర ఉండాలి. ప్రధానిగా మోదీ ఉన్నందున పాస్‌పోర్టుపై ఆయన ఫొటో లేదే? వైకాపాకు ఓటు వేస్తే ప్రజల ఆస్తులు గాలిలో దీపమే. మన ఆస్తి పత్రాలపై జగన్‌ హక్కు ఏంటని నిలదీయాలి’అని పిలుపునిచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు.. బరిలో 525 మంది: సీఈవో వికాస్‌రాజ్

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 525 మంది పోటీలో ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్‌ తెలిపారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను ఆయన వెల్లడించారు. సికింద్రాబాద్‌లో అత్యధికంగా 45 మంది, ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 12 మంది పోటీ చేస్తున్నారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. గాజు గ్లాసు గుర్తును ఇతరులకు కేటాయించొద్దు: ఈసీకి కూటమి విజ్ఞప్తి

గాజు గ్లాసు గుర్తుతో ప్రభావితం అయ్యే 13 పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆ గుర్తును జనసేనకు రిజర్వు చేయాలని కూటమి నేతలు మారోమారు ఈసీని కోరారు. జనసేన పార్టీ ఎన్నికల చిహ్నం గుర్తుపై కోర్టు ఆదేశాలు ఇచ్చిందని, కోర్టు ఉత్తర్వులను ఎన్నికల కమిషన్‌ తప్పుగా అర్థం చేసుకుందని తెదేపా నేత వర్ల రామయ్య అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో పోలీసులకు ఊరట

దిశా నిందితుల ఎన్‌కౌంటర్‌ కేసులో పోలీసులకు ఊరట లభించింది. సిర్పూర్కర్‌ కమిషన్‌ నివేదికపై ఏడుగురు పోలీసులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయస్థానం.. పోలీసులు, షాద్‌నగర్‌ తహశీల్దార్‌పై చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కూటమి మ్యానిఫెస్టోపై సందేహాలుంటే నివృత్తి చేస్తాం: యనమల

పూర్తిగా అమలు చేయదగ్గ మ్యానిఫెస్టోనే తాము రూపొందించామని తెదేపా పొలిట్‌ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పష్టం చేశారు. కూటమి మ్యానిఫెస్టోపై ఎవరికైనా సందేహాలు ఉంటే నివృత్తి చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రాష్ట్రాభివృద్ధికి తీసుకోనున్న చర్యలను వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 24 గంటల్లో అమేఠీ, రాయ్‌బరేలీపై నిర్ణయం: కాంగ్రెస్‌

దేశవ్యాప్తంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్న అమేఠీ, రాయ్‌బరేలీ స్థానాల్లో అభ్యర్థులను 24 గంటల్లో ప్రకటిస్తామని కాంగ్రెస్‌ వెల్లడించింది. ఆ పార్టీ నాయకుడు జైరామ్‌ రమేష్‌ ఈ విషయాన్ని తెలిపారు. ఇప్పటికే అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు కాంగ్రెస్‌ సెంట్రల్‌ ఎలక్షన్‌ కమిటీ నిర్ణయాధికారాన్ని కట్టబెట్టిందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మ్యూచువల్‌ ఫండ్ల కొత్త రూల్‌.. జాయింట్‌ ఖాతాలకు నామినీ తప్పనిసరేం కాదు!

సంయుక్తంగా నిర్వహించే మ్యూచువల్ ఫండ్ ఖాతాలకు నామినీ ఎంపికను క్యాపిటల్ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ ఐచ్ఛికం (Optional) చేసింది. ఈ పెట్టుబడి సాధనంలో మదుపు ప్రక్రియను మరింత సులభతరం చేయడంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకుంది. అలాగే కమొడిటీ, విదేశీ పెట్టుబడుల పర్యవేక్షణకు ఒకే ఫండ్ మేనేజర్‌ ఉండటానికి ఫండ్‌ హౌస్‌లకు అనుమతించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ప్రపంచకప్‌కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్‌!

టీ20 ప్రపంచకప్‌ జట్టులోకి రింకూ సింగ్‌కు స్థానం కల్పించకపోవడం అతిపెద్ద షాక్‌గా క్రికెట్‌ మాజీలు, విశ్లేషకులు భావిస్తున్నారు. ధోనీని తలపించేలా మ్యాచ్‌లకు అద్భుతమైన ఫినిషింగ్‌ను ఇవ్వగల సత్తా అతడి సొంతం. హార్దిక్‌, అర్ష్‌దీప్‌ వంటి వారి ఎంపికకు ఐపీఎల్‌ ఆటతీరును ప్రామాణికంగా తీసుకోని సెలక్టర్లు.. రింకూ విషయంలో మాత్రం దానిని ఎందుకు తీసుకొన్నారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. పాకిస్థాన్‌లో 5 లక్షల సిమ్‌ కార్డులు బ్లాక్‌.. ఎందుకో తెలుసా?

ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పాకిస్థాన్‌.. పన్ను ఆదాయాన్ని పెంచుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. పన్ను ఎగవేతదారులపై కఠిన చర్యలకు ఉపక్రమించింది. గతేడాది రిటర్నులు ఫైల్‌ చేయని 5 లక్షల మంది మొబైల్‌ ఫోన్‌ సిమ్‌ కార్డులను బ్లాక్‌ చేయాలని టెలికాం సంస్థలను ఆదేశించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని