Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 01 May 2024 13:07 IST

1. మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట: తెదేపా అధినేత చంద్రబాబు

శ్రమ దోపిడీని ఎదిరించి శ్రమ శక్తి గెలుపొందిన మహోజ్వల చరిత్రాత్మక దినం ‘మే డే’ అని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. మే డే సందర్భంగా ఆయన ఎక్స్‌(ట్విటర్‌) వేదికగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. తమ కష్టంతో సమాజ నిర్మాణానికి చేయూతనిచ్చే శ్రామికుల హక్కులను కాపాడటంలో తెదేపా ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. మంగళవారం విడుదల చేసిన 2024 ఎన్నికల మ్యానిఫెస్టోలో కార్మిక సంక్షేమానికి పెద్దపీట వేసినట్లు గుర్తుచేశారు. పూర్తి కథనం

2. దాదాపు 100 స్కూళ్లకు ఒకేసారి బాంబు బెదిరింపులు.. దిల్లీలో కలకలం

బాంబు బెదిరింపులతో దేశ రాజధాని ఉలిక్కిపడింది. బుధవారం ఉదయం దిల్లీ (Delhi)-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలోని పదుల సంఖ్యలో స్కూళ్లకు బెదిరింపు మెయిల్‌ (Bomb threats) వచ్చింది. అప్రమత్తమైన స్కూల్‌ యాజమాన్యాలు వెంటనే పోలీసులకు సమాచారమిచ్చాయి. ముందు జాగ్రత్త చర్యగా పాఠశాలల (Schools)ను ఖాళీ చేయించాయి.పూర్తి కథనం

3. నవ సందేహాలు.. సమాధానం చెప్పు జగన్‌: షర్మిల బహిరంగ లేఖ

సీఎం జగన్‌కు ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల బహిరంగ లేఖ రాశారు. నవ సందేహాలకు సమాధానం చెప్పాలని కోరారు. ‘‘ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధుల దారి మళ్లింపు వాస్తవం కాదా? సాగు భూమినిచ్చే కార్యక్రమాన్ని ఎందుకు నిలిపివేశారు? 28 పథకాలను అర్ధంతరంగా ఎందుకు ఆపేశారు?ఎస్సీ, ఎస్టీలకు పునరావాస కార్యక్రమం ఎందుకు నిలిచిపోయింది? పూర్తి కథనం

4. ఆ కథనంపై వ్యాఖ్యానించం.. న్యూదిల్లీతో టచ్‌లో ఉన్నాం: అమెరికా

సిక్కు వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) హత్యకు అమెరికా (USA)లో జరిగిన కుట్ర వెనుక భారత (India) గూఢచర్య సంస్థ ‘రా’ అధికారి ప్రమేయం ఉందని పేర్కొంటూ వాషింగ్టన్‌ పోస్ట్‌ పత్రిక ప్రచురించిన కథనం వివాదాస్పదమైంది. ఈ కథనాన్ని భారత్‌ తీవ్రంగా ఖండించింది.పూర్తి కథనం

5. కాంగ్రెస్‌, భారాస ప్రచారాన్ని ప్రజలు నమ్మరు: భాజపా ఎంపీ లక్ష్మణ్‌

ముఖ్యమంత్రి హోదా స్థాయిని దిగజార్చేలా రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని భాజపా రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ విమర్శించారు. ఆయన మాటల్లో పస లేదని ప్రజలు గుర్తించారన్నారు. నాంపల్లిలోని భాజపా కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌, భారాస నేతల ప్రచారాన్ని ప్రజలు నమ్మరన్నారు. ఆఖరికి ఫేక్‌ వీడియోలు సృష్టించే స్థాయికి రేవంత్‌రెడ్డి దిగజారారని విమర్శించారు.పూర్తి కథనం

6. రష్యా క్షిపణి దాడిలో ‘హ్యారీపోటర్‌ కోట’ ధ్వంసం..!

ఉక్రెయిన్‌లోని అత్యంత సుందర భవనాల్లో ఒక దానిని రష్యా తన క్షిపణి దాడిలో ధ్వంసం చేసింది. నల్ల సముద్ర తీరంలోని ఒడెస్సా నగరంలో హ్యారీపోటర్‌ కోట(Harry Potter Castle)గా ప్రసిద్ధి చెందిన ఓ విద్యా సంస్థ భవనంపై క్షిపణితో దాడి చేసింది. ఇందుకోసం ఇసికందర్‌ క్షిపణిపై క్లస్టర్‌ వార్‌హెడ్‌ను అమర్చి మాస్కో ప్రయోగించినట్లు అనుమానిస్తున్నారు.పూర్తి కథనం

7. పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు ఇచ్చింది పెద్ద ‘గాడిద గుడ్డు’: సీఎం రేవంత్‌ ఎద్దేవా

పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణకు కేంద్రం ఇచ్చింది ఏమీ లేదని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌ (ట్విటర్‌)లో పోస్ట్ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా అడిగాం.. వాళ్లు ఇచ్చింది ‘గాడిద గుడ్డు’ అని సీఎం విమర్శించారు.పూర్తి కథనం

8. దిల్లీలో కాంగ్రెస్‌కు ‘ఆప్‌’సోపాలు.. పొత్తుపై అసంతృప్తితో పార్టీని వీడుతున్న నేతలు

వారం వ్యవధిలోనే దిల్లీలో కాంగ్రెస్‌ (Congress)కు మరో షాక్‌ ఎదురైంది. రెండు లోక్‌సభ సీట్లలోని ఇద్దరు పరిశీలకులు పార్టీని వీడారు. ముఖ్యంగా ఆప్‌-కాంగ్రెస్‌ పొత్తు కారణంగానే తాము ఈ నిర్ణయం తీసుకొన్నట్లు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వేర్వేరుగా రాసిన లేఖల్లో పేర్కొన్నారు. పూర్తి కథనం

9. మెదక్‌ భారాస అభ్యర్థిపై తప్పుడు ప్రచారం సరికాదు: హరీశ్‌రావు

మెదక్‌ భారాస ఎంపీ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తూ ఓట్లు అడగటం సమంజసం కాదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. భాజపా అభ్యర్థి రఘునందన్ రావు తప్పుడు మాటలు మానుకోవాలని హితవు పలికారు. సిద్దిపేటలో వెంకట్రామిరెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.పూర్తి కథనం

10. ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డులున్నాయా? ఈ ప్రయోజనాలు తెలుసా?

డిజిటల్‌ యుగంలో క్రెడిట్‌ కార్డ్‌ (Credit cards) వినియోగం బాగా పెరిగింది. చాలా వరకు లావాదేవీలు క్రెడిట్‌ కార్డుల రూపంలోనే జరుగుతున్నాయి. మునుపటితో పోలిస్తే వీటిని సులువుగా జారీ చేస్తుండడంతో చాలా మంది ఒకటి కంటే ఎక్కువ క్రెడిట్‌ కార్డుల్ని తీసుకుంటున్నారు. వాటిని సరిగ్గా వినియోగించుకుంటే.. దాదాపు 50 రోజుల పాటు వడ్డీ రహిత కాలాన్ని పొందొచ్చు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని