Gangula Kamalakar: మంత్రి గంగుల కమలాకర్‌ ఇంటికి సీబీఐ అధికారులు

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌ ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. అక్కడ గంగుల లేకపోవడంతో.. ఆయన కుటుంబసభ్యులతో అధికారులు మాట్లాడి వివరాలు సేకరించారు.

Updated : 30 Nov 2022 13:44 IST

కరీంనగర్‌: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌ ఇంటికి సీబీఐ అధికారులు వెళ్లారు. అక్కడ గంగుల లేకపోవడంతో.. ఆయన కుటుంబసభ్యులతో అధికారులు మాట్లాడి వివరాలు సేకరించారు. రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతి లేకున్నా ఇటీవల శ్రీనివాస్‌ అనే వ్యక్తి సీబీఐ నుంచి వచ్చానంటూ మంత్రి ఇంటికి వెళ్లినట్లు తెలిసింది. ఆయన నకిలీ సీబీఐ అధికారి అని ఆ తర్వాత తేలడంతో అతడిని దిల్లీలో అరెస్ట్‌ చేసింది. ఈ నేపథ్యంలో సీబీఐ అధికారులు ఇవాళ గంగుల ఇంటికి వెళ్లి ఆరా తీశారు. 

గంగుల కమలాకర్‌కు చెందిన శ్వేత గ్రానైట్స్‌కు సంబంధించి విదేశీమారక ద్రవ్య నిర్వహణ చట్టాన్ని (ఫెమా) ఉల్లంఘించారన్న ఆరోపణలపై కొద్దిరోజుల క్రితం ఈడీ అధికారులు ఆయన ఇల్లు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని