Vizag Airport: తుపాను ప్రభావం.. విశాఖ నుంచి 23 విమానాలు రద్దు

మిగ్‌జాం తుపాను(Cyclone Michaung) ప్రభావం కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ వెల్లడించారు.

Updated : 05 Dec 2023 12:24 IST

విశాఖపట్నం: మిగ్‌జాం తుపాను(Cyclone Michaung) ప్రభావం కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు విశాఖ ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ వెల్లడించారు. ఈమేరకు విశాఖ నుంచి 23 విమానాల సర్వీసులను రద్దు(flights cancelled) చేస్తున్నట్లు చెప్పారు. ‘‘విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో ఆపరేషన్‌లో ఉంచుతున్నాం. అత్యవసర సర్వీసులు, మళ్లింపుల కోసం ఏటీసీ 24 గంటలూ పని చేస్తుంది. రన్‌వే నవీకరణ పనుల వల్ల రాత్రి 8 వరకే విమానాశ్రయంలో రాకపోకలకు అనుమతి ఇస్తున్నాం’’ అని ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ తెలిపారు. 

మిగ్‌జాం ఎఫెక్ట్‌: కూలిన చెట్లు.. విద్యుత్‌ స్తంభాలు.. వేలాది ఎకరాల్లో పంట నష్టం

మరికొన్ని గంటల్లో బాపట్లకు సమీపంలో ‘మిగ్‌జాం’ తుపాను తీరం దాటనుంది. కోస్తాంధ్ర తీరానికి సమాంతరంగా కదులుతోంది. తీవ్ర తుపానులో కొంతభాగం సముద్రంలో.. మరికొంత భాగం భూమిపై ఉన్నట్లు ఐఎండీ వెల్లడించింది. తీరానికి అత్యంత దగ్గరగా తుపాను కదులుతోందని చెప్పింది. కావలి తీరానికి 40కి.మీ., బాపట్లకు 80కి.మీ. దూరంలో తీవ్ర తుపాను ఉన్నట్లు వివరించింది. ప్రస్తుతం తీరప్రాంతంలో గంటకు 90-110 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తున్నట్లు ఐఎండీ వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని