రాష్ట్ర ప్రభుత్వానికి ‘విశాఖ ఉక్కు’ను కొనుగోలు చేసే యోచన ఉందా?: హైకోర్టు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది.

Published : 14 Mar 2024 19:12 IST

అమరావతి: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు కీలక ప్రశ్నలు సంధించింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ప్రతిపాదన ఏదశలో ఉంది? పరిశ్రమకు చెందిన భూములను విక్రయించారా? విక్రయిస్తే.. ఎన్ని ఎకరాలు విక్రయించారు? వివరాలు సమర్పించాలని ఉక్కు పరిశ్రమ సీఎండీని ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. స్టీల్‌ ప్లాంట్‌ను కొనుగోలు చేసే యోచన రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? అని ఏజీని ప్రశ్నించింది. భూముల విక్రయ దస్త్రాలు కోర్టు ముందుంచాలని పిటిషనర్‌కు సూచిస్తూ.. తదుపరి విచారణను హైకోర్టు ఈనెల 22కి వాయిదా వేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని