TS High Court: కానిస్టేబుల్‌ నియామక పరీక్షపై సింగిల్‌ బెంచ్‌ తీర్పును కొట్టివేసిన హైకోర్టు

కానిస్టేబుల్‌ నియామక పరీక్షపై సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొట్టివేసింది. 

Updated : 04 Jan 2024 17:30 IST

హైదరాబాద్‌: కానిస్టేబుల్‌ నియామక పరీక్షపై సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ కొట్టివేసింది. సివిల్‌ కానిస్టేబుల్‌ పరీక్షలో నాలుగు ప్రశ్నలకు సంబంధించి మార్కులు కలపాలని సింగిల్‌ బెంచ్‌ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ గురువారం హైకోర్టు ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం సాయం తీసుకొని నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని, అభ్యంతరాలు ఉన్న నాలుగుప్రశ్నలపై నిపుణుల కమిటీ తేల్చాలని పోలీసు నియామక మండలి (TSLPRB)ని ఆదేశించింది.  

నాలుగు ప్రశ్నలకు ఆప్షన్లను తెలుగులో ఇవ్వకపోవడం వల్ల నష్టపోయామని కొంతమంది అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. నాలుగు ప్రశ్నలకు ఆప్షన్లను వాడుకలో ఉన్న పదాలనే ఇచ్చామని పోలీసు నియామక మండలి ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లింది. నాలుగు ప్రశ్నలపై అభ్యంతరాలను నిపుణుల కమిటీ తేల్చిన తర్వాత నియామక ప్రక్రియ పూర్తి చేయాలని ధర్మాసనం ఆదేశించింది. నాలుగు వారాల్లోగా కానిస్టేబుల్‌ నియామక ప్రక్రియ పూర్తి చేయాలని పోలీసు నియామక మండలికి సూచించింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని