‘జవాన్‌’ పోస్టర్లు ఇలా కూడా వాడొచ్చన్నమాట... క్రియేటివిటీకి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే!

Nagpur police: సైబర్‌ భద్రతపై అవగాహన కోసం నాగ్‌పుర్ పోలీసులు జవాన్‌ పోస్టర్లను వినియోగించారు. వీరి క్రియేటివిటీపై ప్రశంసలు దక్కుతున్నాయి.

Published : 07 Sep 2023 19:05 IST

ఇంటర్నెట్ డెస్క్‌: రహదారి భద్రత, సైబర్‌ భద్రత, ఇతర మోసాల గురించి పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజలకు అవగాహన కల్పిస్తుంటారు. అందుకోసం ప్రముఖుల చేత ప్రచారం చేయించడం, కొన్ని వీడియోలను రూపొందించడం, నిజ జీవితంలో జరిగిన కొన్ని వీడియోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచడం వంటివి చేస్తుంటారు. ఈ విషయంలో నాగ్‌పుర్‌ పోలీసులు కాస్త క్రియేటివ్‌గా ఆలోచించారు. తాజాగా షారుక్‌ (shahrukh khan) నటించిన ‘జవాన్‌’ పోస్టర్లను సైబర్‌ భద్రతపై అవగాహన కోసం వినియోగించారు.

రివ్యూ: జవాన్‌.. షారుక్‌, నయనతార యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే?

చాలా మంది తమ సోషల్‌మీడియా హ్యాండిళ్లకూ, ఫోన్‌ పాస్‌వర్డ్‌ కూడా ఒకటే పెట్టుకుంటారు. ఒకవేళ సైబర్‌ నేరగాళ్లకు సున్నితమైన సమాచారం దొరికితే ఇక అంతే సంగతులు. అందుకే వేర్వేరు అకౌంట్లకు వేర్వేరు పిన్‌, పాస్‌వర్డ్‌లు పెట్టుకోవాలని సైబర్‌ నిపుణులు సూచిస్తుంటారు. నాగ్‌పుర్‌ సిటీ పోలీసులు సైతం అదే విషయాన్ని కాస్త వినూత్నంగా చెప్పారు. ‘జవాన్‌’లో షారుక్‌ వేషధారణలు అన్నింటినీ ఒక చోట చేర్చి.. వేర్వేరు పాస్‌వర్డ్‌లు పెట్టుకోవాలని ప్రజలకు సూచించారు. సైబర్‌ భద్రతపై చాలా చక్కగా అవగాహన కల్పిస్తున్నారంటూ నాగ్‌పుర్‌ సిటీ  పోలీసులను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని