Andhra News: పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ అడ్డుకట్టకు కొత్త మార్గదర్శకాలు

గత కొన్ని రోజులుగా పదో తరగతి ప్రశ్న పత్రాలు లీక్‌ కావడంతో విద్యాశాఖ అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందుకో కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. పరీక్షా

Published : 03 May 2022 20:47 IST

అమరావతి: గత కొన్ని రోజులుగా పదో తరగతి ప్రశ్న పత్రాలు లీక్‌ కావడంతో విద్యాశాఖ అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇందుకో కొత్తగా మార్గదర్శకాలను జారీ చేసింది. పరీక్షా కేంద్రాలను నో ఫోన్‌ జోన్లుగా ప్రకటిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. చీఫ్ సూపరింటెండెంట్‌ల ఫోన్లకూ అనుమతి నిరాకరించారు. పరీక్షా కేంద్రాల్లో సెల్‌ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాలు ఏమైనా కనిపిస్తే వెంటనే సీజ్‌ చేస్తామని హెచ్చరించారు. స్మార్ట్‌ వాచ్‌, ఇయర్‌ ఫోన్లు, ఐ పాడ్లు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించబోమని స్పష్టం చేశారు. ప్రశ్న పత్రంలో ప్రతి పేజీ మీద సెంటర్‌ నెంబర్‌, రోల్‌ నంబర్‌ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఇన్విజిలేటర్లకు ఆదేశాలు జారీ చేశారు.  ప్రశ్న పత్రం ఇవ్వగానే విద్యార్థులతో సెంటర్‌ నంబర్‌, రోల్‌ నంబర్‌ రాయించాలని విద్యాశాఖ సూచనలు జారీ చేసింది. పరీక్ష నిర్వహణలో ఎవరైనా తప్పిదాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసకుంటామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని