TS News: తెలంగాణలో 3 రోజులపాటు ఉరుములు మెరుపులతో వర్షాలు

తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

Updated : 19 Aug 2023 14:31 IST

హైదరాబాద్‌: తెలంగాణలో రానున్న మూడు రోజులపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇవాళ ఆదిలాబాద్‌, కుమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతుందని పేర్కొంది. ఇదే అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ రాగల 24 గంటల్లో ఈశాన్య మధ్యప్రదేశ్ మీదుగా వెళ్లే అవకాశం ఉందని తెలిపింది.

ఆదిలాబాద్‌ ఎడతెరిపిలేని వర్షం..

మరోవైపు, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. రాత్రి నుంచి మొదలైన ముసురు ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి వస్తున్న వరదతో స్వర్ణ ప్రాజెక్టు 2 గేట్లు, గడ్డెన్నవాగు ప్రాజెక్టు ఒక గేటు వదిలి దిగువకు నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. బోథ్‌ కండ్రే వాగు, నక్కలవాడ, కోట వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని