Tomato Price: మదనపల్లె మార్కెట్‌లో రికార్డు స్థాయికి టమాటా ధర

మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో టమాటా పంట దిగుబడి తగ్గింది.

Updated : 26 Jul 2023 12:51 IST

మదనపల్లె గ్రామీణం: మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండటంతో టమాటా పంట దిగుబడి తగ్గింది. మదనపల్లె మార్కెట్‌ పరిధిలో బుధవారం రికార్డు స్థాయిలో కిలో నాణ్యమైన టమాటా రూ.168 పలికింది. మార్కెట్‌కు రైతులు కేవలం 361 టన్నులు మాత్రమే తీసుకువచ్చారు.  మార్కెట్‌లో ఏ గ్రేడ్‌ కిలో రూ.140 నుంచి రూ.168, బీ గ్రేడ్‌ రూ.118 నుంచి రూ.138 వరకు.. సగటున కిలో రూ.132 నుంచి రూ.156 వరకు పలికిందని మార్కెట్‌ యార్డు కార్యదర్శి అభిలాష్‌ తెలిపారు. మంగళవారం రూ.140 పలికిన ధర.. ప్రస్తుతం రూ.160కి పైగా పలకడంతో వినియోగదారుల్లో గుబులు మొదలైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని