Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 22 Apr 2024 09:10 IST

1. ఖమ్మం టికెట్‌.. తెరపైకి మరో పేరు

కాంగ్రెస్‌ తరఫున ఖమ్మం లోక్‌సభ స్థానానికి రఘురామిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావుల పేర్లు ఇప్పటికే తెరపైకి రాగా తాజాగా ఇదే జిల్లాకు చెందిన రాయల నాగేశ్వరరావు పేరును కొందరు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆయనను గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా నియమించింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడం వల్ల ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. పూర్తి కథనం 

2. జగన్‌ గులకరాయి డ్రామానూ జనం ఛీ కొట్టారు

సానుభూతి ఓట్లతో గెలవాలని జగన్‌ చూస్తున్నారని.. లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు చెప్పడంలో ఆయనకు ఎవరూ సాటిలేరని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ‘రాష్ట్రానికి తానేం చేశారో చెప్పలేక డ్రామాలాడుతున్నారు. పింఛన్ల విషయంలో కుట్రలు చేశారు. ఆయన ఆడిన గులకరాయి డ్రామానూ ప్రజలు ఛీకొట్టారు. ప్రజాగళం యాత్రకు వస్తున్న స్పందనే జగన్‌ పతనాన్ని చాటిచెబుతోంది’ అని పేర్కొన్నారు.పూర్తి కథనం 

3. సీపీ గారూ.. పిల్లల చేతుల్లో వాహనాయుధాలు..

గౌరవ పోలీసు కమిషనర్‌, రామగుండం గారికి,

ఆర్యా,

మేము మంచిర్యాల జిల్లా వాసులం.. మరికొద్ది రోజుల్లో పాఠశాలలకు సెలవులు రానున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారులతో పాటు యువతకు చెందిన కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకురావాలని ఆశిస్తున్నాం..పూర్తి కథనం 

4. ‘గులకరాయి’ తేలుతుందా!

సీఎం జగన్‌పై గులక రాయితో దాడి ఘటన జరిగి తొమ్మిది రోజులైనా పోలీసులు ఎలాంటి పురోగతి సాధించలేకపోయారు. ఎనిమిది బృందాలతో కూడిన ప్రత్యేక టీమ్‌ ఏర్పాటు చేసినా, సమాచారం ఇచ్చిన వారికి రూ. 2 లక్షల రివార్డు ప్రకటించినా లాభం కనిపించడం లేదు. తెదేపా నాయకుడు దుర్గారావును నాలుగు రోజులపాటు అదుపులో ఉంచుకుని ప్రశ్నించినా కేసును ముందుకు తీసుకెళ్లే ఆధారాలు లభ్యం కాలేదు. పూర్తి కథనం 

5. జోష్‌ .. వస్తలేదు

లోక్‌సభ ఎన్నికలకు గ్రేటర్‌ సిద్ధమవుతోంది. ఇప్పటికే నామినేషన్ల పర్వం ప్రారంభమైంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కిందిస్థాయి నేతలు, క్యాడర్‌లో ఉన్న జోష్‌.. ఇప్పుడు కనిపించడం లేదు. నేతల పిలుపు వస్తే చూద్దాంలే అన్నట్లు కిందిస్థాయి కార్యకర్తలు, చోటామోటా నేతలు ఉన్నారు. అన్ని ప్రధాన పార్టీల్లోనూ ఇదే పరిస్థితి.పూర్తి కథనం 

6. ‘అమ్మఒడి’.. మామ కత్తెర!

సంక్షేమ పథకాలను సంతృప్తికర స్థాయిలో అమలు చేస్తున్నామని భుజాలు చరుచుకునే జగన్‌ మాటల్లోని డొల్లతనాన్ని ‘అమ్మఒడి’ పథకం బట్టబయలు చేసింది. చిన్నారులకు మేనమామనంటూ.. వారి చదువుల బాధ్యత తనదేనంటూ గొప్పలు చెప్పి చివరకు టోపీ పెట్టారు. 2019 ఎన్నికలకు ముందు ఇద్దరు పిల్లల్ని బడికి పంపితే ఒక్కొక్కరికి రూ.15వేల చొప్పున ఇస్తామంటూ జగన్‌ సతీమణి భారతి ప్రచారం చేశారు.పూర్తి కథనం 

7. మిస్టర్‌ అబద్ధం..! విజయవాడకు రూ. 150 కోట్లు ఇస్తానని చెప్పి వంచించిన జగన్‌

విజయవాడ, మచిలీపట్నాల అభివృద్ధి కోసం గత అయిదేళ్లలో జగన్‌ చేసిందేమిటంటే... రూ. వందల కోట్ల అబద్ధపు హామీలు గుప్పించడం. అంతేకాదు.. పన్నుల బాదుడుతో జనం బతకలేక పారిపోయేంతగా భయపెట్టడం. కానీ.. వైకాపా నేతలు మాత్రం.. విజయవాడను ఉద్ధరించేశాం.. బందరును ముస్తాబు చేసేశామంటూ.. ఊదరగొడుతూ ప్రకటనలు గుప్పించేస్తున్నారు.పూర్తి కథనం 

8. ఓటర్లకు వైకాపా కర్ణాటక కిక్కు!

ఐదేళ్ల పాలనలో ప్రజావ్యతిరేకతను మూటగట్టుకున్న వైకాపా ఎన్నికల్లో గెలుపు కష్టమని భావించి.. ప్రలోభాల పర్వానికి తెరలేపింది. ఇందులో భాగంగా ఓటర్లను మత్తులో ముంచేందుకు యత్నిస్తోంది. నామినేషన్ల ర్యాలీలు మొదలుకుని ప్రచారం ముగిసేంత వరకూ ఇదే వ్యూహాన్ని అనుసరించాలని నిర్ణయించుకున్నారు.పూర్తి కథనం 

9. భూతాపం.. మనుగడకు శాపం

విచ్చలవిడిగా చెట్లు నరికివేయడం, వాహనాల, పారిశ్రామిక కాలుష్యం, మొక్కలు నాటకపోవడం వంటి కారణాలతో రోజురోజుకీ భూతాపం పెరుగుతోంది. ఎండలు మండుతున్నాయి. ఏసీలు, కూలర్లు లేనిదే ఇళ్లలో ఉండలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పటికే ఎండలు 45 డిగ్రీలు దాటి 50 డిగ్రీల దాకా నమోదవుతున్నాయి. పూర్తి కథనం 

10. రూ.కోటి చొప్పున తెప్పించి ఎక్కడికి పంపారు..?

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచి(ఎస్‌ఐబీ)లో ఆధారాల ధ్వంసం ఘటనతో మొదలై ఫోన్‌ ట్యాపింగ్‌ ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చిన కేసు ఇప్పటికీ మలుపులు తిరుగుతూనే ఉంది. ఈ కేసులో ఇప్పటికే నలుగురు పోలీసు అధికారులు జ్యుడిషియల్‌ కస్టడీలో ఉండగా.. తాజాగా విశ్రాంత ఎస్పీ దివ్యచరణ్‌రావును పోలీసులు విచారించడం ప్రాధాన్యం సంతరించుకొంది.పూర్తి కథనం 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని