icon icon icon
icon icon icon

ఖమ్మం టికెట్‌.. తెరపైకి మరో పేరు

కాంగ్రెస్‌ తరఫున ఖమ్మం లోక్‌సభ స్థానానికి రఘురామిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావుల పేర్లు ఇప్పటికే తెరపైకి రాగా తాజాగా ఇదే జిల్లాకు చెందిన రాయల నాగేశ్వరరావు పేరును కొందరు ప్రతిపాదించినట్లు తెలిసింది.

Published : 22 Apr 2024 06:05 IST

ఈనాడు, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ తరఫున ఖమ్మం లోక్‌సభ స్థానానికి రఘురామిరెడ్డి, మండవ వెంకటేశ్వరరావుల పేర్లు ఇప్పటికే తెరపైకి రాగా తాజాగా ఇదే జిల్లాకు చెందిన రాయల నాగేశ్వరరావు పేరును కొందరు ప్రతిపాదించినట్లు తెలిసింది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆయనను గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా నియమించింది. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడం వల్ల ఇంకా బాధ్యతలు తీసుకోలేదు. ఈ స్థానానికి తీవ్ర పోటీ నెలకొని పేరు ప్రకటించడంలో జాప్యం జరుగుతున్న నేపథ్యంలో తాజాగా కొందరు నాగేశ్వరరావు పేరును తెరపైకి తెచ్చినట్లు తెలిసింది. గతంలో ఆయన ఉమ్మడి ఖమ్మం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి ఓడిపోయారు. రెండు రోజులుగా ఖమ్మం అభ్యర్థిపై కాంగ్రెస్‌ ముఖ్య నాయకుల మధ్య తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్‌ గాంధీల నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నట్లు తెలిసింది. అలాగే కరీంనగర్‌, హైదరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాలకు కూడా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 25తో నామినేషన్ల దాఖలుకు గడువు ముగియనుంది. కాబట్టి సోమ లేదా మంగళవారాల్లో ఈ మూడు నియోజకవర్గాలకు కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించవచ్చని నేతలు భావిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి వచ్చే నెల 11 వరకు గడువు ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img