Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 29 May 2024 08:59 IST

1. పిన్నెల్లిది మొదటి నుంచి అరాచకమే!

వెల్దుర్తి మండలం కండ్లకుంట గ్రామానికి చెందిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి యువజన కాంగ్రెస్‌లో ఉంటూ 2006లో వెల్దుర్తి మండల జడ్పీటీసీ సభ్యుడిగా పోటీకి దిగారు. సొంత పార్టీలో పలువురు పోటీపడుతున్నా పెదనాన్న లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేగా ఉండటంతో ఆయన సహకారంతో వారందరినీ కాదనీ జడ్పీటీసీ సభ్యుడిగా బరిలో నిలిచారు. కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థికి పోటీగా తెదేపా తరఫున పట్లవీడు గ్రామానికి చెందిన వెంకట్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. పూర్తి కథనం

2. అవినీతి అధికారులే ‘చక్రం’ తిప్పుతున్నారు

రాష్ట్రంలో పలు ప్రాంతీయ రవాణా సంస్థ(ఆర్టీఏ) కార్యాలయాలు, చెక్‌పోస్టుల్లో భారీ ఎత్తున అవినీతి జరుగుతోంది. అవినీతి నిరోధకశాఖ(ఏసీబీ) రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం జరిపిన తనిఖీల్లో నివ్వెరపోయే అంశాలు వెలుగుచూశాయి. కార్యాలయాల్లోనే పెద్దమొత్తంలో డబ్బులు దొరికాయి. అక్రమాల్ని అరికట్టాల్సిన ఉన్నతాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో క్షేత్రస్థాయిలో పనిచేసే అధికారులు అవినీతికి పాల్పడుతున్నారు.పూర్తి కథనం

3. రైలు ప్రయాణమా.. 139 గుర్తుంచుకోండి

రైలు ప్రయాణంలో ఏమైనా ఇబ్బందులు ఎదురైతే.. మీరు ప్రయాణిస్తున్న బోగీలో సమస్యలు ఉంటే.. రైలులోగాని, స్టేషన్‌లో గానీ మీ లగేజీని మర్చిపోతే.. మీ విలువైన వస్తువులేమైనా చోరీకి గురైతే.. ఇలాంటి సమస్యలపై ఫిర్యాదుకు రైల్వేశాఖ అందుబాటులోకి తీసుకొచ్చిన టోల్‌ఫ్రీ నంబరే 139.పూర్తి కథనం

4. రాత్రుల్లోనూ చల్లబడని మహానగరాలు

పెరుగుతున్న కాంక్రీటీకరణ, గాలిలో తేమ స్థాయులు దేశంలోని మహానగరాల్లో వేడిని పెంచుతున్నాయని, దశాబ్ద క్రితంనాటితో పోలిస్తే ఇప్పుడు రాత్రిపూట కూడా ఇవి చల్లబడటం లేదని ‘సెంటర్‌ ఫర్‌ సైన్స్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌’ (సీఎస్‌ఈ) తాజా నివేదిక తెలిపింది. జనవరి 2001 నుంచి ఏప్రిల్‌ 2024 వరకు ఆరు మహా నగరాలు- దిల్లీ, ముంబయి, కోల్‌కతా, హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలో వేసవి తీవ్రతను దీనిలో విశ్లేషించింది. పూర్తి కథనం

5. గడప గడపలో తిరకాసే!

బిల్లుల కోసం వెళ్లిన గుత్తేదారులను ఉన్నతాధికారి బుజ్జగించి రెండు మాసాలైంది. ఇప్పటికీ ఒక్క పైసా రాలేదు. గతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించినప్పుడు ప్రజలు చెప్పిన పనులను వెంటనే పూర్తి చేసేందుకని ప్రతీ సచివాలయానికి రూ. 20 లక్షల చొప్పున మంజూరు చేసి, నేరుగా కలెక్టరు ఖాతాకు జమ చేస్తామని ప్రభుత్వం చెప్పింది.పూర్తి కథనం

6. సాయంత్రమూ బీటెక్‌ చదవొచ్చు

ఉద్యోగం చేసుకుంటూనే బీటెక్‌ చదివే అవకాశం వచ్చేసింది. ఒకవైపు కొలువు చేస్తూనే...వారాంతంలో రెండు రోజులపాటు తరగతులకు హాజరై ఇంజినీరింగ్‌ పూర్తి చేయవచ్చు. అదీ మూడేళ్లలోనే బీటెక్‌ పట్టా దక్కించుకోవచ్చు. కాకపోతే పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తి చేసి ఉండటం తప్పనిసరి. అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) దేశవ్యాప్తంగా గత విద్యా సంవత్సరమే(2023-24) సాయంత్రం బీటెక్‌ కోర్సులకు పచ్చజెండా ఊపింది.పూర్తి కథనం

7. రూ.100 కోట్ల విలువైన మాన్సాస్‌ భూమిపై కన్ను

విజయనగరం పరిధిలోని దాదాపు రూ.100 కోట్ల విలువైన దేవాదాయ భూములపై కన్నేసి.. దాన్ని అధికారపార్టీ నేతల సహకారంతో సొంతం చేసుకోవాలని కొందరు చూస్తున్నారు. ఆ భూమి దేవాదాయశాఖ పరిధిలోనిదని గతంలో స్పష్టంగా చెప్పినా పట్టించుకోకుండా దస్త్రాన్ని కదుపుతున్నారు. దీనివెనుక ఆ శాఖ మంత్రి, ఉత్తరాంధ్రకు చెందిన ఓ కీలకమంత్రి పావులు కదుపుతున్నట్లు తెలిసింది.పూర్తి కథనం

8. పట్టణాల్లోనూ కోతలు

ఉన్నట్లుండి విద్యుత్‌ సరఫరా నిలిచిపోతుంది. లేకుంటే లోవోల్టేజీతో లైట్లు మిణుకు మిణుకుమంటాయి. మారుమూల గ్రామాల్లో ఇలాంటి పరిస్థితి ఉందంటే సరిపెట్టుకోవచ్చు. కానీ పట్టణాల్లోనూ ప్రజలకు విద్యుత్‌ కష్టాలు తప్పడం లేదు.  నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామంటూ విద్యుత్‌ పంపిణీ సంస్థలు (డిస్కంలు) చెప్పే మాటలు నిజం కావని చెప్పడానికి పట్టణ ప్రాంతాల్లో తలెత్తుతున్న విద్యుత్‌ అంతరాయాలే నిదర్శనం.పూర్తి కథనం

9. ఒకే కుటుంబంలో 110 ఓట్లు

లోక్‌సభ ఎన్నికల సమరం తుది దశకు చేరుకుంది. ఏడో విడత బరిలో నిలిచే అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు చివరి ప్రయత్నాలు చేస్తున్నారు. జూన్‌ 1న ఏడో విడతలో పోలింగ్‌ జరగనున్న క్రమంలోనే బిహార్‌ రాజధాని పట్నాలోని ‘చందెల్‌ నివాస్‌’ రాజకీయ నాయకులను విపరీతంగా ఆకర్షిస్తోంది. ఆ ఇంట్లోని కుటుంబంలో 165మంది సభ్యులు ఉండగా, వారిలో 110 మంది ఓటర్లు కావడమే ఇందుకు కారణం.పూర్తి కథనం

10. భాజపా 200 మార్కును దాటదు: ఖర్గే

ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో 400కు పైగా సీట్లు గెలుస్తామంటూ భాజపా చెబుతున్న మాటలు వట్టి ప్రగల్భాలేనని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఎద్దేవా చేశారు. వాస్తవానికి ఆ పార్టీ 200 స్థానాల మార్కును కూడా దాటదని పేర్కొన్నారు. పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘ఈ ఎన్నికల్లో భాజపా సీట్లు తగ్గుతున్నాయి. మా స్థానాలు పెరుగుతున్నాయి. 400కుపైగా నియోజకవర్గాలను గెల్చుకుంటామని కమలదళం చెబుతున్న మాటల్లో అర్థం లేదు. పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని