Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 03 Jun 2024 13:10 IST

1. దిల్లీ మద్యం కేసు.. ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ పొడిగింపు

మద్యం కేసులో భారాస ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్‌ రిమాండ్‌ను జులై 3 వరకు న్యాయస్థానం పొడిగించింది. ఈ మేరకు దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో ఆమెకు విధించిన కస్టడీ ముగియడంతో సోమవారం కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో కవిత పాత్రపై ఈడీ ఇటీవల సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. పూర్తి కథనం

2. హైదరాబాద్‌లో గోడ కూలి ఇద్దరు చిన్నారులు మృతి

హైదరాబాద్‌లోని మైలార్‌దేవ్‌పల్లి పోలీసు స్టేషన్ పరిధి బాబుల్ రెడ్డి నగర్‌లో విషాదం చోటు చేసుకుంది. వర్షంతో పాత గోడ కూలడంతో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. మరో ఇద్దరు పిల్లల పరిస్థితి విషమంగా ఉంది. మృతులను బిహార్ వాసులుగా గుర్తించారు. పూర్తి కథనం

3. పిన్నెల్లికి సుప్రీం షాక్‌.. కౌంటింగ్‌ కేంద్రంలోకి వెళ్లొద్దని ఆంక్షలు

వైకాపాకు చెందిన మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సుప్రీంకోర్టు షాక్‌ ఇచ్చింది. ఆయనపై ఆంక్షలు విధించింది. ఓట్ల లెక్కింపు రోజు కౌంటింగ్‌ కేంద్రంలోకి పిన్నెల్లి వెళ్లొద్దని ఆదేశించింది. పాల్వాయిగేటు తెదేపా పోలింగ్‌ ఏజెంట్‌ నంబూరి శేషగిరిరావు ఇటీవల దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయస్థానం విచారణ జరిపిందిపూర్తి కథనం

4,. ఎగ్జిట్‌ పోల్స్‌ జోష్‌.. భారీ లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

అంతా ఊహించినట్లుగానే దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ ఏకంగా 2,000 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడింగ్‌ మొదలుపెట్టింది. నిఫ్టీ ఆరంభంలోనే 500 పాయింట్లకు పైగా పుంజుకుంది. ఎన్‌డీఏ కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు సూచీల్లో జోష్‌ నింపాయి.పూర్తి కథనం

5. తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ కోసం క్లిక్‌ చేయండి

తెలంగాణ పాలిసెట్‌ ఫలితాలు (Telangana Polycet Results) విడుదలయ్యాయి. డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి మే 24న ఈ పరీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 82,809 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ఈ ఫలితాలను విడుదల చేశారు.పూర్తి కథనం

6. కత్తితో దాడి చేసినా.. హైదరాబాద్‌లో దొంగలను ప్రతిఘటించిన యువకుడు

బైక్‌పై వచ్చి సెల్‌ఫోన్‌ తీసుకొని ఉడాయించడానికి యత్నించిన ఇద్దరు ఆగంతకులను ఓ యువకుడు ధైర్య సాహసాలతో పట్టుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం... హైదరాబాద్‌లోని వెంగళరావునగర్‌ పరిధి లక్కీ హాస్టల్‌లో నివాసం ఉంటున్న పి.జాషువా కుమార్‌ ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో హాస్టల్‌ బయట కూర్చున్నాడు. పూర్తి కథనం

7. ‘నన్ను జైలుకు పంపితే..’ ట్రంప్‌ పరోక్ష హెచ్చరిక!

తనకు జైలు శిక్ష విధించడాన్ని తన మద్దతుదారులు జీర్ణించుకోలేకపోవచ్చని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) అన్నారు. దేనికైనా ఒక పరిమితి ఉంటుందని.. అలాగే తనని అభిమానించేవారికి కూడా కొన్ని హద్దులు ఉంటాయని వ్యాఖ్యానించారు. తనని జైలుకు పంపితే రాజకీయ ప్రకంపనలు, హింసాత్మక ఘటనలు తప్పకపోవచ్చని పరోక్షంగా సంకేతమిచ్చారు.పూర్తి కథనం

8. గాల్లో ఢీకొన్న విమానాలు.. పైలట్‌ మృతి.. వీడియోలో రికార్డయిన దృశ్యాలు!

దక్షిణ పోర్చుగల్‌లో జరుగుతున్న ఎయిర్‌షోలో (Portugal Air Show) ప్రమాదం చోటుచేసుకుంది. విన్యాసాలు ప్రదర్శిస్తున్న సమయంలో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ పైలట్‌ మృతిచెందగా.. మరో పైలట్‌ తీవ్రంగా గాయపడ్డారు.పూర్తి కథనం

9. రూ.1,000లోపే ఓటీటీ, డీటీహెచ్‌, 3.3TB డేటాతో ఎయిర్‌టెల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ ప్లాన్లు

భారతీ ఎయిర్‌టెల్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సర్వీస్‌ ఎక్స్‌ట్రీమ్‌ ఫైబర్‌ (Airtel Xstream Fiber) క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. అందుకోసం కంపెనీ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతోంది. స్థానిక కేబుల్‌ ఆపరేటర్లతో భాగస్వామ్యం కుదుర్చుకుంటోంది. తద్వారా బ్రాడ్‌బ్యాండ్‌ సేవలను యూజర్లకు మరింత చేరువ చేసింది.పూర్తి కథనం

10. న్యూయార్క్‌ స్టేడియం.. గాయాల విషయంలో తస్మాత్ జాగ్రత్త: ద్రవిడ్ 

టీ20 ప్రపంచ కప్‌లో (T20 World Cup 2024) భారత్‌ లీగ్‌ స్టేజ్‌లో మూడు మ్యాచ్‌లను న్యూయార్క్‌లోని నాసౌవ్‌ కౌంటీ స్టేడియం వేదికగా.. మరో మ్యాచ్‌ను ఫ్లోరిడా మైదానంలో ఆడనుంది. బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్‌ కూడా నాసౌవ్‌లోనే జరిగింది. ఇందులో టీమ్‌ఇండియా ఘన విజయం సాధించింది.పూర్తి కథనం

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు