Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 30 May 2024 12:59 IST

1. ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట

సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)కు హైకోర్టులో ఊరట లభించింది. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఉత్తర్వులను సస్పెండ్‌ చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఏబీవీ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఇటీవల క్యాట్‌ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. పూర్తి కథనం

2. అంతరిక్షంలోకి భారత్‌ సరికొత్త ‘అగ్నిబాణ్‌’..!

ప్రపంచ అంతరిక్ష మార్కెట్లను ఒడిసిపట్టేలా భారత్‌ మరో కీలక ముందడుగు వేసింది. ప్రత్యేకశ్రేణి ఉపగ్రహాలను వీలైనంత వేగంగా.. కారు చౌకగా కక్ష్యలోకి ప్రవేశపెట్టేందుకు వీలుగా ప్రయోగం చేపట్టింది. చెన్నై ఐఐటీ కేంద్రంగా పనిచేసే అగ్నికుల్‌ (Agnikul) సంస్థ ‘అగ్నిబాణ్‌’ పేరిట తొలిసారి సబ్‌-ఆర్బిటాల్‌ టెక్నాలజీ డెమానిస్ట్రేటర్‌ ప్రయోగాన్ని నిర్వహించింది.పూర్తి కథనం

3. కాణిపాకం హుండీల లెక్కింపులో బ్యాంకు అప్రైజర్‌ చేతివాటం

చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ హుండీల లెక్కింపులో బ్యాంకు అప్రైజర్‌ చేతివాటం ప్రదర్శించాడు. భక్తులు స్వామివారికి సమర్పించిన బంగారం, వెండి తదితర కానుకలను ఆలయ ఆస్థాన మండపంలో గురువారం లెక్కించారు.పూర్తి కథనం

4. చల్లని కబురు.. కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు వినిపించింది. దేశ వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థకు జీవనాడి అయిన నైరుతి రుతుపవనాలు (Southwest monsoon) దేశ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించినట్లు తెలిపింది. ఇవి గురువారం ఉదయం కేరళ (Kerala)ను తాకాయని ఐఎండీ (IMD) అధికారికంగా వెల్లడించింది. పూర్తి కథనం

5. ప్రజారోగ్యం పట్ల రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం: హరీశ్‌రావు

నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్ఎం) ‌పరిధిలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం 3 నెలలుగా జీతాలు చెల్లించకపోవడం బాధాకరమని భారాస ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు ఎక్స్‌(ట్విటర్) వేదికగా తెలిపారు. అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, బస్తీ దవాఖానాలు, తెలంగాణ డయాగ్నోస్టిక్స్ తదితర 78 విభాగాల్లో పనిచేస్తున్న 17,541 మంది జీతాలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.పూర్తి కథనం

6. రాష్ట్ర చిహ్నంలో చార్మినార్‌ను తొలగించడం మూర్ఖపు నిర్ణయమే: కేటీఆర్‌

నగర ప్రగతి కనిపించకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తోందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ విమర్శించారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పుల ప్రతిపాదన దృష్ట్యా భారాస నేతలు చార్మినార్‌ వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. పూర్తి కథనం

7. పుణె కారు ఘటన.. బాలుడి రక్త నమూనా స్థానంలో తల్లిది తీసుకొని..!

మహారాష్ట్ర (Maharashtra News)లోని పుణె (Pune)లో టీనేజర్ కారు ర్యాష్‌ డ్రైవింగ్‌ (Pune Car Crash) కారణంగా ఇద్దరు టెకీలు మృతి చెందిన కేసులో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రధాన నిందితుడైన మైనర్ రక్త నమూనా పరీక్ష నివేదికను వైద్యులు మార్చేసినట్లు ఇదివరకు వెల్లడైన సంగతి తెలిసిందే. దానిని తన తల్లి రక్త నమూనాతో మార్చివేసినట్లు పోలీసులు వర్గాలు వెల్లడించాయి.పూర్తి కథనం

8. ట్రంప్‌ గెలిస్తే వైట్‌హౌస్‌లోకి మస్క్‌!

టెస్లా, స్పేస్‌ఎక్స్‌ సీఈవో ఎలాన్‌ మస్క్‌ను (Elon Musk) సలహాదారుడిగా నియమించుకోవాలని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Trump) యోచిస్తున్నట్లు సమాచారం. రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందితే అడ్వైజర్‌ హోదాలో అతణ్ని వైట్‌హౌస్‌కు ఆహ్వానించాలని నిర్ణయించారని విశ్వసనీయ వర్గాలను పేర్కొంటూ వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ ఓ కథనంలో వెల్లడించింది.పూర్తి కథనం

9. విమానం ఇంజిన్‌లో దూకి ఆత్మహత్య..?

అనుమానాస్పద స్థితిలో విమానం ఇంజిన్‌లో పడి ఓ వ్యక్తి మృతిచెందిన ఘటన నెదర్లాండ్స్‌లోని ఆమ్‌స్టర్‌డామ్‌ (Amsterdam airport) విమానాశ్రయంలో చోటు చేసుకొంది. డెన్మార్క్‌కు ప్రయాణించేందుకు కేఎల్‌ 1341 విమానం పుష్‌బ్యాక్‌ అవుతున్న సమయంలో అక్కడే ఉన్న వ్యక్తిని ఒక్కసారిగా ఇంజిన్‌ లోపలికి లాక్కొంది. పూర్తి కథనం

10. 75 రోజులు.. 180 ర్యాలీలు.. సగం ఆ నాలుగు రాష్ట్రాల్లోనే: మోదీ ‘ప్రచార సునామీ’ ఇదీ..!

లోక్‌సభ ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్నాయి. జూన్‌ 1న జరిగే చివరి విడత పోలింగ్‌కు గురువారం సాయంత్రంతో ప్రచారం ముగియనుంది. ఈ ఎన్నికలతో హ్యాట్రిక్‌ విజయమే లక్ష్యంగా దూసుకెళ్తున్న భాజపా (BJP) ప్రచారంలోనూ ఆ దూకుడు సాగించింది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) సుడిగాలి పర్యటనలు చేపట్టారు.పూర్తి కథనం

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని