Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు..

Updated : 26 Jan 2023 13:02 IST

1. Republic Day: ఘనంగా గణతంత్ర వేడుకలు.. ప్రత్యేక ఆకర్షణగా ‘ఆత్మనిర్భర్‌’ ఆయుధాలు

దేశవ్యాప్తంగా గణతంత్రదినోత్సవ(Republic Day) వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. దేశ రాజధాని నగరం దిల్లీలోని కర్తవ్యపథ్‌లో మొదటిసారి నిర్వహించిన ఆర్మీ కవాతులో త్రివిధ దళాలు ప్రపంచానికి తమ సత్తాను చాటిచెప్పాయి. ఈసారి గణతంత్ర దినోత్సవ కవాతుకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ‘ఆత్మనిర్భర్‌’ కింద పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన యుద్ధ ట్యాంకులు ఆకర్షణగా నిలిచాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. Republic Day: దేశ ప్రజలకు మోదీ శుభాకాంక్షలు.. అమర జవానులకు నివాళి

దేశం 74వ గణతంత్ర దినోత్సవ(Republic Day) వేడుకలు నిర్వహిస్తోన్న వేళ.. ప్రధాని నరేంద్రమోదీ(Modi) శుభాకాంక్షలు తెలియజేశారు. ‘దేశ ప్రజలకు గణంతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ సారి ఈ వేడుకలు మరింత ప్రత్యేకం. ఎందుకంటే ఆజాదీ కా అమృత్‌ మహోత్సవం వేళ.. వీటిని నిర్వహిస్తున్నాం. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను నెరవేర్చే విధంగా కలిసికట్టుగా ముందుకు సాగుదాం’ అని ప్రధాని ట్వీట్ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆ విషయంలో నా కారణాలు నాకున్నాయి: పవన్‌కల్యాణ్‌

ప్రజాస్వామ్యం అంటే ప్రజల సొంతమని.. వైకాపానో.. సజ్జల సొంతమనో కాదని గుర్తుంచుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. మంగళగిరిలో మాట్లాడుతూ.. ‘‘నేను ఆషామాషీగా రాలేదు. అవగాహన లేకుండా ఏదీ మాట్లాడను. నువ్వు ఒక్కోసారి ఒక్కో పార్టీతో వెళ్తావు అని కొందరు అంటుంటారు. ఆ విషయంలో నా కారణాలు నాకున్నాయి. నేను మధ్య దారిలో ఉంటాను. నాకోసం కాకుండా ప్రజల అవసరాల మేరకు మారుతూ ఉంటాను’’ అని పవన్‌ పేర్కొన్నారు. వీడియో కోసం క్లిక్‌ చేయండి

4. Trump: ట్రంప్‌ ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాల పునరుద్ధరణ

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Trump) ఫేస్‌బుక్‌ (Facebook), ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram) ఖాతాలను పునరుద్ధరిస్తున్నట్లు మెటా (Meta) ప్లాట్‌ఫామ్స్‌ బుధవారం ప్రకటించింది. 2020 ఆఖర్లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ (Trump) ఓటమిపాలైన విషయం తెలిసిందే. దీన్ని జీర్ణించుకోలేని ఆయన మద్దతుదారులు 2021, జనవరి 6న క్యాపిటల్‌ హిల్‌పై దాడికి దిగారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. Rajamouli: ‘కాస్త గ్యాప్‌ ఇవ్వమ్మా’.. రాజమౌళి ఆసక్తికర ట్వీట్‌

తన సోదరుడు, సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి (Keeravani)కి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు (Padma Shri Award) ప్రకటించడం పట్ల అమితానందం వ్యక్తం చేశారు దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli). అన్నయ్య విషయంలో తాను గర్వంగా ఉన్నట్లు చెప్పారు. కీరవాణిని చూస్తూ కూర్చొన్న ఓ ఫొటోని ఆయన షేర్‌ చేశారు. తన అన్నయ్యకు వరుస అవార్డులు రావడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన జక్కన్న.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Nellore: చిత్తు కాగితాలు ఏరుతున్న చేతులకు పలకా.. బలపం..!

వారి జీవితాల్లో నిత్యం చెత్తకుప్పలే దర్శనమిస్తాయి. వారి చేతులు చిత్తు కాగితాలే ఏరుతాయి. అపరిశుభ్ర వాతావరణంతో నిత్యం యుద్ధం జరపాలి. అప్పుడే నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్తాయి. ఆకలి కేకలతో బతుకే భారమైన చోట.. పిల్లలకు మంచి భవిష్యత్ ఇవ్వాలనే ఆలోచన ఓ స్వచ్ఛంద సంస్థను కదిలించింది. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో.. దుర్భరమైన బతుకుల్లో విద్యా కుసుమాలు విరబూయించేందుకు ఆ సంస్థ నడుం బిగించింది. వీడియో కోసం క్లిక్‌ చేయండి

7. Keeravani: ఇది నా విజయం మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరిది..: కీరవాణి

ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి(Keeravani) గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఊర్రూతలూగించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR) చిత్రానికి అవార్డులు రావడం.. వాటిని గవర్నర్‌ చేతుల మీదగా తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది కేవలం తన కష్టం మాత్రమే కాదని.. తనతో పాటు పనిచేసిన ప్రతి ఒక్కరి విజయమన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. Bandi Sanjay: రాజ్యాంగాన్ని అవమానించిన కేసీఆర్‌కు దేశంలో ఉండే అర్హత లేదు: బండి సంజయ్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) రాజ్యాంగ విరుద్ధంగా పాలన సాగిస్తున్నారని భాజపా(BJP) రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్(Bandi Sanjay) ఆరోపించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో(Republic day) ఆయన పాల్గొన్నారు. అంబేడ్కర్, గవర్నర్, రాజ్యాంగం, కోర్టులు, మహిళలకు కేసీఆర్ గౌరవం ఇవ్వడం లేదని విమర్శించారు. వీడియో కోసం క్లిక్‌ చేయండి

9. IND vs PAK: జైషాతో తప్పకుండా చర్చిస్తా.. పాక్‌ క్రికెట్‌కు ప్రయోజనం: నజామ్ సేథీ

ఆసియా కప్‌ 2023 టోర్నమెంట్‌ నిర్వహణను పాకిస్థాన్‌కు అప్పగించినప్పటి నుంచి.. భారత క్రికెట్‌ నియంత్రణ బోర్డు (బీసీసీఐ), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) మధ్య మాటల యుద్ధం మొదలైన విషయం తెలిసిందే. పాక్‌లో ఆసియా కప్‌ నిర్వహిస్తే భారత్‌ పర్యటించదని బీసీసీఐ కార్యదర్శి, ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) జై షా ప్రకటించారు. దీనిపై నాటి పీసీబీ ఛైర్మన్‌ రమీజ్‌ రజా కూడా స్పందిస్తూ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Basara: వసంత పంచమి.. బాసరలో అక్షరాభ్యాసాలకు పోటెత్తిన భక్తులు

ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర(Basara)లో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వసంత పంచమి సందర్భంగా తమ పిల్లలకు అక్షరాభ్యాసాలు చేయించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా బాసరలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జాతీయ పతాకం ఆవిష్కరించారు. వీడియో కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు