Keeravani: ఇది నా విజయం మాత్రమే కాదు.. ప్రతి ఒక్కరిది..: కీరవాణి

పద్మశ్రీ పురస్కారం వరించడంపై కీరవాణి(Keeravani) హర్షం వ్యక్తం చేశారు. ట్విటర్‌ వేదికగా తన తల్లిదండ్రులకు ధన్యవాదాలు తెలిపారు.

Updated : 26 Jan 2023 12:44 IST

హైదరాబాద్‌: ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి(Keeravani) గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొని మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఊర్రూతలూగించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’(RRR) చిత్రానికి అవార్డులు రావడం.. వాటిని గవర్నర్‌ చేతుల మీదగా తీసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది కేవలం తన కష్టం మాత్రమే కాదని.. తనతో పాటు పనిచేసిన ప్రతి ఒక్కరి విజయమన్నారు. పెద్దల ఆశీర్వాదాలతోనే  ఇంతటి ఘనత సాధించామని సంతోషం వ్యక్తం చేశారు. ఇక పద్మశ్రీ పురస్కారం రావడంపై కీరవాణి తన ఆనందాన్ని ట్విటర్‌ వేదికగా పంచుకున్నారు. ‘‘భారత ప్రభుత్వ పౌర పురస్కారం వరించిన సందర్భంగా నా తల్లిదండ్రులతో పాటు నా గురువులు కవితపు సీతమ్మ గారి నుంచి కుప్పాల బుల్లి స్వామి నాయుడు గారి వరకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు’’ అని ట్వీట్‌ చేశారు.

ఇక ఇటీవల ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలోని ‘నాటు నాటు’ పాటకు కీరవాణి గోల్డెన్ గ్లోబ్‌(Golden Globe) అందుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఆయన ప్రతిభకు పద్మశ్రీ అవార్డు (Padma Shri Award) వరించింది. ఈ సందర్భంగా ఆయనకు అభిమానులు, సినీ ప్రేక్షకులు అభినందనలు తెలుపుతున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా ఎన్నో అరుదైన అవార్డులను సొంతం చేసుకుంది. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట సినీ ప్రపంచం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్‌ నామినేషన్లలోనూ చోటు దక్కించుకున్న విషయం తెలిసిందే. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని